ఏపీ సీఎం ఆఫీస్‌ వ‌ద్ద ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

తాజా వార్తలు

Updated : 19/05/2021 15:15 IST

ఏపీ సీఎం ఆఫీస్‌ వ‌ద్ద ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

అమ‌రావ‌తి: గుంటూరు జిల్లా తాడేప‌ల్లిలోని సీఎం జ‌గ‌న్ క్యాంపు కార్యాల‌యం వ‌ద్ద దంప‌తులు ఆత్మ‌హ‌త్యాయత్నానికి పాల్ప‌డ‌టం క‌ల‌క‌లం సృష్టించింది. సురేశ్‌, స‌ర‌స్వ‌తి దంప‌తులు పెట్రోల్ పోసుకుంటుండ‌గా అడ్డుకున్న పోలీసులు వారిని తాడేప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

కృష్ణా జిల్లా పెద్ద అవుటుప‌ల్లికి చెందిన ఈ దంప‌తులు సీఎంను క‌లిసేందుకు వ‌చ్చిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న‌ట్లు.. సీఎం స‌హాయం కోసం వ‌చ్చిన‌ట్లు దంప‌తులు చెబుతున్నార‌ని వివ‌రించారు. కొవిడ్ నిబంధ‌న‌ల కార‌ణంగా సీఎంను క‌లిసే అవ‌కాశం లేద‌ని చెప్ప‌డంతో వారు పెట్రోల్ పోసుకొని ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డార‌ని పోలీసులు తెలిపారు. 

 


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని