Drugs Case: ఈడీకి వివరాలు ఇవ్వరెందుకు?
close

తాజా వార్తలు

Published : 29/04/2021 14:37 IST

Drugs Case: ఈడీకి వివరాలు ఇవ్వరెందుకు?

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసు వివరాలను ఈడీకి ఎందుకు ఇవ్వడంలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. డ్రగ్స్‌ కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలంటూ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి దాఖలుచేసిన పిల్‌పై విచారణ జరిపింది. 2016 నాటి కేసులు సీబీఐ, ఈడీకి ఇవ్వడంలేదంటూ న్యాయవాది రచనా రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎక్సైజ్‌ అధికారులు డ్రగ్స్‌ కేసు వివరాలను తమకు ఇవ్వడం లేదని ఈడీ తెలిపింది.ఎఫ్‌ఐఆర్‌లు, ఛార్జిషీట్లు ఇచ్చేలా ఆదేశించాలని కోర్టును కోరింది. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. ఈడీకి వివరాలు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించింది. డ్రగ్స్‌ కేసుల నిందితులను దాచిపెట్టాల్సిన అవసరమేంటని నిలదీసింది. డ్రగ్స్‌పై నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ఏం చేస్తోంది?కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని