రాజకీయ లబ్ధి కోసమే మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిటిషన్‌: కేంద్రం

తాజా వార్తలు

Updated : 28/07/2021 14:03 IST

రాజకీయ లబ్ధి కోసమే మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిటిషన్‌: కేంద్రం

అమరావతి: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో కేంద్ర ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ప్రైవేటీకరణ ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోందని.. ఈ మేరకు ప్రధాని నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకుందని పేర్కొంది. దేశ ఆర్థిక అవసరాలపై తీసుకున్న నిర్ణయాలపై విచారణ తగదని ప్రస్తావించింది. పెట్టుబడుల ఉపసంహరణ అంశంపై సుప్రీం కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేసిన కేంద్రం.. ప్రక్రియను అనుభవజ్ఞులైన ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారని పేర్కొంది.

వ్యాజ్యం దాఖలు చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేశారని.. రాజకీయ లబ్ధి కోసమే పిటిషన్‌ వేశారని కౌంటర్‌లో పేర్కొంది. లక్ష్మీనారాయణ పిల్‌కు విచారణార్హత లేదని తెలిపింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని