HYD : లాల్‌ దర్వాజా బోనాలు.. 8వేల మందితో బందోబస్తు

తాజా వార్తలు

Published : 31/07/2021 13:06 IST

HYD : లాల్‌ దర్వాజా బోనాలు.. 8వేల మందితో బందోబస్తు

సీపీ అంజనీ కుమార్‌

హైదరాబాద్‌ : నగరంలో జరిగే లాల్‌దర్వాజా బోనాలకు తగిన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు. అంబారీ ఊరేగింపు సందర్భంగా వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. కమిషనర్ నుంచి హోంగార్డు వరకూ అందరూ బందోబస్తు విధుల్లో పాల్గొంటారని స్పష్టం చేశారు. పాతబస్తీలోని పలు కాలనీల నుంచి బోనాల ఊరేగింపు లాల్ దర్వాజా మహంకాళి ఆలయానికి చేరుకుంటుందని.. రంగం, పోతురాజు ప్రవేశం కూడా ఉంటుందని తెలిపారు. అన్ని కార్యక్రమాలు సాఫీగా సాగేలా తగిన ఏర్పాట్లు చేసినట్లు సీపీ వెల్లడించారు. ఇందు కోసం పలు శాఖలను సమన్వయం చేసుకొని ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. 8 వేల మందితో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని