Corona: కంటైన్‌మెంట్‌ జోన్‌గా తిరుపతి
close

తాజా వార్తలు

Updated : 26/04/2021 16:09 IST

Corona: కంటైన్‌మెంట్‌ జోన్‌గా తిరుపతి

తిరుపతి: తిరుపతి నగరాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా నగరపాలక సంస్థ కమిషనర్‌ గిరీషా ప్రకటించారు. తిరుపతిలోని ప్రతి డివిజన్‌లో కరోనా కేసులున్నాయని.. వైరస్‌ కట్టడికి ప్రజలే బాధ్యత తీసుకోవాలని సూచించారు. తిరుపతిలోని తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో వ్యాపార సంఘాలు, ఆటో, జీపు డ్రైవర్ల యూనియన్లతో ఎమ్మెల్యే  భూమన కరుణాకర్‌రెడ్డి, నగరపాలక కమిషనర్‌ గిరీషా, ఎస్పీ వెంకటప్పలనాయుడు సమావేశమయ్యారు. కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు స్వీయ నియంత్రణ తీసుకోవడంతో పాటు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టాలనేదానిపై సుదీర్ఘంగా చర్చించారు.

రేపటి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరిచేలా తాము నిర్ణయం తీసుకున్నట్లు వ్యాపార సంఘాలు అధికారులకు తెలిపాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ ప్రజలు కూడా స్వచ్ఛందంగా బాధ్యత తీసుకోవాలని కోరారు. వైరస్‌ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి నగరాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా నగరపాలక కమిషనర్‌ ప్రకటించారు. గత 2 నెలలలోనే 9,164 కరోనా పాజిటివ్‌ కేసులు నగర పరిధిలో నమోదయ్యాయన్నారు. ఓ వైపు కేసుల నియంత్రణ.. మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని