Top 10 News @ 1PM

తాజా వార్తలు

Published : 22/04/2021 13:03 IST

Top 10 News @ 1PM

1. Corona: 3లక్షలు దాటిన కొత్త కేసులు

కరోనా వైరస్ భారత్‌ను చుట్టుముట్టి, ఊపిరాడనివ్వడం లేదు. మునుపెన్నడూ లేనంత ఉద్ధృతితో ప్రభుత్వాలు, ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒక రోజులో మూడు లక్షలకు పైగా కేసులు, రెండు వేలకు పైగా మరణాలతో దేశంలో మహమ్మారి బుసలు కొడుతోంది. తాజాగా దేశంలో ఒక్కరోజే 3.14లక్షల మంది కరోనా బారినపడగా.. అగ్రరాజ్యం అమెరికాను దాటి ప్రపంచంలోనే అత్యధిక రోజువారీ కేసులు భారత్‌లోనే నమోదవడం గమనార్హం. అంతకుముందు అమెరికాలో 24 గంటల్లో 3.07లక్షల కేసులు బయటపడ్డాయి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. ఏపీలో ప్రైవేట్‌ టీచర్లను ఆదుకోవాలి: అచ్చెన్న

ప్రైవేట్‌ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని ఏపీ తెదేపా అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కరోనా దెబ్బకు ఉపాధ్యాయుల బతుకులు దుర్భరంగా మారాయని చెప్పారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఇప్పటి వరకు 25 మంది ప్రైవేటు టీచర్లు మృతిచెందినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అచ్చెన్న ఆరోపించారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. ఆ ఖర్చుని పీఎంకేర్స్‌ నుంచి భరించలేరా: KTR

దేశంలో కొవిడ్‌ వ్యాక్సిన్ల ధరల వ్యత్యాసంపై మంత్రి కేటీఆర్‌ ఈ ఉదయం ట్వీట్‌ చేశారు. ‘‘ఒకే దేశంలో ఇప్పుడు వ్యాక్సిన్లకు 2 ధరలు చూస్తున్నాం. కేంద్రానికి రూ.150, రాష్ట్రాలకు రూ.400 టీకా అంటున్నారు. అదనపు ఖర్చుని కేంద్రం పీఎం కేర్స్‌ నిధి నుంచి భరించలేదా? దేశమంతా వ్యాక్సినేషన్‌ పూర్తికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందా?ఒకే దేశం- ఒకే పన్ను కోసం జీఎస్టీని అంగీకరించాం’’ అని కేటీఆర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. మోదీజీ ప్రసంగాలు కాదు.. పరిష్కారం చెప్పండి

కేంద్ర ప్రభుత్వ అలసత్వం, ప్రజా వ్యతిరేక విధానాల వల్లే దేశంలో ఇలాంటి దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రసంగాల వల్ల ఎలాంటి లాభం లేదంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పరోక్షంగా విమర్శలు సంధించిన ఆయన.. ఈ సంక్షోభానికి పరిష్కారం చూపాలని ట్విటర్‌ వేదికగా డిమాండ్‌ చేశారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. ‘మా అమ్మను కౌగిలించుకోవాలని ఉంది’

‘‘మార్చి 30, 2021న కొవిడ్‌తో నా కళ్లముందే ఒక వ్యక్తి మరణించారు. 40ఏళ్లున్న ఆ వ్యక్తి బతుకుతాడానుకున్నా. కానీ, తెల్లారే ఆ వ్యక్తి ప్రాణాలు విడిచారు. ఒక రెసిడెంట్‌ డాక్టర్‌గా విధుల్లో చేరిన నాకు అది తొలి అనుభవం. చాలా ఆవేదనకు గురయ్యా. 2020లో పరిస్థితులు ఇంకా ఘోరంగా ఉండేవంటూ అప్పుడు నా సీనియర్లు నాకు భరోసా ఇచ్చారు. కానీ, 2021 అంతకంటే దారుణంగా ఉంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. ‘టీకా పంపిణీలో అపూర్వ విజయం సాధించాం’

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా టీకాల పంపిణీ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన గడువు కన్నా ముందే సాధించడంపై అధ్యక్షుడు జో బైడెన్‌ సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో 200 మిలియన్ల టీకా డోసుల పంపిణీ పూర్తయిన సందర్భంగా ఆయన ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. బిహార్‌లో 500 మంది డాక్టర్లకు కరోనా

కొవిడ్‌ మహమ్మారిపై వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ముందుండి పోరాడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ రోగులకు నిరంతరం చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది డాక్టర్లు వైరస్‌ కాటుకు గురవుతున్నారు. తాజాగా బిహార్‌లోని రెండు ప్రధాన ఆసుపత్రుల్లో 500 మందికి పైగా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కరోనా బారినపడ్డారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. బౌలర్లదే ఈ ఘనత.. మరో 15 పరుగులు చేయాల్సింది

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో హైదరాబాద్‌ ఎట్టకేలకు బోణీ కొట్టింది. తొలుత బౌలర్లు నమ్మకాన్ని నిలబెడుతూ పంజాబ్‌ను 120 పరుగులకే కట్టడి చేశారు. ఖలీల్‌ 3 వికెట్లు, అభిషేక్‌ 2 వికెట్లతో ఆకట్టుకున్నారు. తర్వాత జానీ బెయిర్‌స్టో 63 పరుగులతో రాణించడంతో రైజర్స్‌ 18.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికే లక్ష్యాన్ని చేరుకున్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. మా సినిమా ఆడలేదు: కార్తికేయ

కార్తికేయ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన విభిన్న ప్రేమకథా చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మిశ్రమ స్పందనలు అందుకుంది. కాగా, శుక్రవారం నుంచి ‘చావుకబురు చల్లగా’ చిత్రం ఆహా ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏర్పాటు చేసిన ఓ ప్రెస్‌మీట్‌లో చిత్రబృందం పాల్గొంది. ఓటీటీ కోసం తమ చిత్రాన్ని రీఎడిట్‌ చేసినట్లు చిత్ర దర్శకుడు కౌశిక్‌ తెలిపారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. విదేశీ పెట్టుబడులు...రూ.40,00,000 కోట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో (ఎఫ్‌పీఐలు) మదుపర్ల పెట్టుబడుల విలువ గత ఆర్థిక సంవత్సరంలో (2020-21) 555 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.40,00,000 కోట్లు)కు చేరింది. 2020 సెప్టెంబరు నుంచి 2021 మార్చి మధ్య ఈ విలువ 105 బిలియన్‌ డాలర్లు పెరిగిందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌  నివేదిక తెలిపింది. దేశీయ సంస్థాగత మదుపర్ల పెట్టుబడుల విలువ 2020-21 చివరినాటికి 203 బిలియన్‌ డాలర్లుగా (సుమారు రూ.15,00,000 కోట్లు) ఉంది. ఎఫ్‌పీఏల పెట్టుబడుల విలువలో ఇది సగం కంటే తక్కువే. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని