World Photography Day 2021: అందరి చూపు ఆ గుడ్డుపైనే.. ఎందుకంటే

తాజా వార్తలు

Published : 19/08/2021 01:27 IST

World Photography Day 2021: అందరి చూపు ఆ గుడ్డుపైనే.. ఎందుకంటే


ఇంటర్నెట్‌ డెస్క్: ఒక్కోసారి అంతే.. ఏది ఎందుకు జనాల్ని ఆకర్షిస్తుందో ప్రత్యేకించి చెప్పలేం. గురువారం జరుపుకోబోయే ప్రపంచ ఫొటోగ్రాఫీ దినోత్సవం( ఆగస్టు19) పురస్కరించుకుని మళ్లీ ఆ గుడ్డు ఫొటో నెటింట చక్కర్లు కొడుతోంది. విషయానికొస్తే.. సరిగ్గా రెండేళ్ల క్రితం ప్రపంచ ఫొటోగ్రాఫీ దినోత్సవం సందర్భంగా బ్రౌన్‌ రంగులో ఉండే ఓ గుడ్డు చిత్రాన్ని విడుదల చేసింది వరల్డ్‌ రికార్డ్‌ ఎగ్‌ అనే ఇన్‌స్టా పేజీ. ప్రపంచంలో ఎక్కడా రానన్ని లైకులు ఈ గుడ్డుకి తెప్పిద్దాం అనే క్యాప్షన్‌ను జత చేశారు. అప్పటి నుంచి అనేకమంది లైకుల వర్షం కురిపించారు. ఈ ఫొటో విడుదలై రెండేళ్లు దాటిన అదే జోరుతో 55 మిలియన్ల లైక్‌లతో ముందుకు దూసుకెళ్తోంది. ఇన్‌స్టాలో ఇప్పటి వరకూ వరకు ఏ సెలబ్రెటీ సంపాదించుకోని లైకులు ఈ గుడ్డు సంపాదించుకుంది. అందుకే ఈ గుడ్డు వెరీ గుడ్డు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు.

 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని