సారీ..స్విగ్గీ: జొమాటో
close

తాజా వార్తలు

Published : 16/04/2021 01:18 IST

సారీ..స్విగ్గీ: జొమాటో

మహారాష్ట్రలో ఆంక్షలు..పొరబడిన సంస్థ

ముంబయి: ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ పొరపడి పెట్టిన ట్వీట్‌కు ముంబయి పోలీసులు స్పష్టత ఇచ్చారు. మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కారణంగా ఇటీవల అక్కడి ప్రభుత్వం రాత్రి ఎనిమిది నుంచి లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలను విధించింది. అత్యవసర సేవలకు మాత్రం అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలోనే దీపిందర్ ట్వీట్ చేశారు. ‘ముంబైలో రాత్రి ఎనిమిది తరవాత అవసరమైన ఫుడ్ డెలివరీ చేయడానికి జొమాటో సిద్ధం. అయితే మేం చట్టానికి కట్టుబడి ఉంటున్నాం. కానీ పోటీ సంస్థ రాత్రి ఎనిమిది తరవాత కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దీనిపై ముందుకెళ్లే మార్గాన్ని స్పష్టం చేయమని ముంబయి పోలీసుల్ని కోరుతున్నాను’ అంటూ దీపిందర్‌ స్విగ్గీ హోం పేజీని షేర్ చేశారు.

 ఆయన చేసిన అభ్యర్థనకు ముంబయి పోలీసులు వెంటనే స్పందించారు. ‘ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఒకసారి గమనించండి. వాటిలో హోం డెలివరీకి అనుమతించింది. ఎక్కడ కూడా కాలపరిమితి విధించలేదు’ అని జవాబిచ్చారు. దీనిపై ముంబయి పోలీసులకు దీపిందర్ కృతజ్ఞతలు చెప్పారు. అలాగే స్విగ్గీని ట్యాగ్ చేసి..‘క్షమాపణలు, మాకు మరో అవకాశం లేదు’ అంటూ వ్యాఖ్యను జోడించారు. అయితే జొమాటో సీఈఓ వైఖరిని మాత్రం నెటిజన్లు తప్పు పడుతున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని