close

ప్రధానాంశాలు

నాకిదే మదర్స్‌ డే గిఫ్ట్‌ : నీతా అంబానీ

హైదరాబాద్‌ : ముంబయి ఇండియన్స్‌ జట్టు ఐపీఎల్‌ చరిత్రలో నాలుగోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించిన ఆ జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, ఈ విజయంపై ఆ జట్టు యజమాని నీతా అంబానీ మాట్లాడారు. ‘మాతృ దినోత్సవం సందర్భంగా.. ఐపీఎల్‌ ట్రోఫీనే బహుమతి ఇచ్చావు. థాంక్యూ ఆకాశ్‌..’ అంటూ తన కుమారుడు అకాశ్‌ అంబానీతో అన్నారు. ముంబయి జట్టులోని ఆటగాళ్లంతా ఒక కుటుంబంలా ఉంటారనే విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో మిగితా ఫ్రాంచైజీల కంటే ముంబయి ఇండియన్స్‌ యాజమాన్యం ఆటగాళ్ల విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ఉంటుంది. అంతేకాదు.. ‘ముంబయి ఇండియన్స్‌ కుటుంబం’ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉంటుంది. ఆటగాళ్లకు అన్ని రకాల సదుపాయాలు కల్పించి వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడంతో పాటు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపేందుకు కృషి చేసినందుకు ఆకాశ్‌కు నీతా కృతజ్ఞతలు తెలిపారు. అంతకు మందు జట్టు ప్రధాన కోచ్‌ మహేళ జయవర్దనే మాట్లాడుతూ.. ‘జట్టు ఆటగాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అకాశ్‌ నిత్యం ఆరాటపడుతుంటారని అన్నారు. ముంబయి ఇండియన్స్‌ యాజమాన్యం జట్టు సభ్యులతో స్నేహంగా ఉంటారని పేర్కొన్నాడు. సీజన్‌ తొలి మ్యాచ్‌లో దిల్లీ చేతిలో ఓడిన రోహిత్‌ సేనను ముంబయి యాజమాన్యం నీతా అంబానీ ఇంటికి ఆహ్వానించి ఆటగాళ్లలో స్థైర్యాన్ని నింపారని గుర్తు చేశాడు.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net