ప్రధానాంశాలు

Published : 09/06/2021 13:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Dinosaur: రెండంతస్తుల భవనమంత డైనోసార్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: మరో కొత్త డైనోసార్ జాతిని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచంలో ఇప్పటివరకూ గుర్తించిన అతిపెద్ద డైనోసార్లలో ఇదీ ఒకటని వెల్లడించారు. మొక్కలు తిని బతికే సౌరపోడ్ జాతికి చెందిన ఈ డైనోసార్లు 92 నుంచి 96 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించాయని తమ పరిశోధనా పత్రంలో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇవి 5 నుంచి ఆరున్నర మీటర్ల ఎత్తు సుమారు 25 నుంచి 30 మీటర్ల వెడల్పు ఉండేవని వివరించారు. అంటే సుమారు బాస్కెట్ బాల్ కోర్టంత వెడల్పు రెండు అంతస్తుల భవనమంతా ఎత్తు ఉండేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆ డైనోసార్ శిలాజాన్ని ఉపయోగించుకుని, త్రిడీ టెక్నాలజీతో వీరు ఓ ఎముకను తయారుచేశారు. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు కనుగొన్న డైనోసార్ జాతుల్లో ఇదే అతి పెద్దదని ప్రపంచంలో మొదటి 5 స్థానాల్లో నిలిచిందని తెలిపారు.


ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net