తెలుగు వర్సిటీ దూరవిద్యా కోర్సులకు ఆహ్వానం 
close

తాజా వార్తలు

Published : 27/10/2020 19:17 IST

తెలుగు వర్సిటీ దూరవిద్యా కోర్సులకు ఆహ్వానం 

హైదరాబాద్‌: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలో 2020-21 విద్యా సంవత్సరానికి గాను దూదవిద్యా కేంద్రం ద్వారా నిర్వహించే వివిధ కోర్సులకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు వర్సిటీ ఇన్‌ఛార్జ్‌ ఉప కులపతి నీతూ కుమారి ప్రసాద్‌ ప్రవేశాలకు సంబంధించిన ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ప్రారంభించారు. ఏడాది, రెండేళ్ల కాల వ్యవధితో పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులను అందించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేశ్‌ తెలిపారు. ఎలాంటి అదనపు రుసుం లేకుండా నవంబర్‌ 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలను www.teluguuniversity.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు దూరవిద్యా కేంద్రం సంచాలకులు ఆచార్య సీహెచ్‌ మురళీకృష్ణ వివరించారు.

పీజీ డిప్లొమా కోర్సులు (ఏడాది కాల వ్యవధి)
1. టీవీ జర్నలిజం
2. జ్యోతిర్వాస్తు

డిప్లొమా కోర్సులు (రెండేళ్ల కాల వ్యవధి)
1. లలిత సంగీతం

డిప్లొమా కోర్సులు (ఏడాది కాలవ్యవధి)
* ఫిల్మ్‌ షూటింగ్‌
* జ్యోతిషం

సర్టిఫికెట్ కోర్సులు 
1. సంగీత విశారద
2. ఆధునిక తెలుగు
3. జ్యోతిషం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని