close

తాజా వార్తలు

Published : 07/10/2020 16:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘జపాన్‌ గురించి గొప్పలు చెప్పకు’

‘ఆండ్రాయిడ్‌ కట్టప్ప’ టైలర్‌ చూశారా..!

హైదరాబాద్‌: ‘జపాన్‌ గురించి గొప్పలు చెప్పకు.. నలుగురు మనుషులు కలిసి నాలుగు వైపుల తవ్వి తీసి.. ఎత్తి సముద్రంలో పడేసేటంతటి చిన్నది జపాన్‌’ అని అంటున్నారు మలయాళీ నటుడు సూరజ్‌ వెంజరాముడు. ఆయన, సౌబిన్‌ షహీర్‌ కీలకపాత్రల్లో నటించిన మలయాళీ చిత్రం ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25’. రతీశ్‌ బాలకృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది మలయాళంలో విడుదలై అక్కడి ప్రేక్షకులను అలరించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని ‘ఆండ్రాయిడ్‌ కట్టప్ప’ పేరుతో ఆహా వేదికగా ప్రేక్షకులకు చేరువ చేయనున్నారు. అక్టోబర్‌ 9న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ‘మిక్సీ వద్దు.. గ్రైండర్‌ వద్దు.. ప్రిడ్జ్‌ వద్దు.. ఫోన్‌ వద్దు.. టీవీ వద్దు.. మనుషులు వద్దు.. చివరికీ రోబో కూడా వద్దు.. అసలు నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావ్‌ నాన్న’ అంటూ తన తండ్రిని ఉద్దేశిస్తూ సౌబిన్‌ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకునేలా ఉంది. సూరజ్‌, సౌబిన్‌ నటన మెప్పించేలా ఉంది.




Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని