close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 14/03/2020 20:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గోదావరి నదికి హారతిచ్చిన పవన్‌

ధవళేశ్వరం: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఈ సాయంత్రం ధవళేశ్వరంలోని రామ పాదాల రేవు వద్దకు చేరుకున్న పవన్‌.. గోదావరి నదికి హారతి ఇచ్చారు. అనంతరం ‘మన నుడి - మన నది’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ధవళేశ్వరం వద్ద కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ఉదయం పార్టీ ముఖ్య నేతలతో పవన్‌ సమావేశమయ్యారు. భావితరాలకు మన భాష, సంస్కృతి, స్వచ్ఛమైన నదులను బహుమతులుగా అందించాలనే సంకల్పంతో ‘మన నుడి - మన నది’ కార్యక్రమానికి జనసేన శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.