close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. మోదీని కలిసే యోచనలో సీఎం కేసీఆర్‌

ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్‌... రెవెన్యూ, ఆర్థిక అంశాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘కేంద్రమంత్రుల మాటలకు, వాస్తవాలకు పొంతన లేదు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి రాష్ట్ర పన్నుల వాటా తక్కువగా వచ్చింది. రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా రూ.924 కోట్లు తగ్గింది’ అని పేర్కొన్నారు. పన్నుల వాటా ప్రకారం నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి సీఎం లేఖ రాశారు. కేంద్రం నిధుల కోసం ప్రధాని మోదీని కలిసే యోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. బస్సు ఛార్జీల పెంపు నిర్ణయానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆమోదముద్ర వేసినట్లు ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించాలంటే ఛార్జీల పెంపు తప్పదని స్పష్టం చేశారు. పల్లె వెలుగు, సిటీ సర్వీసుల్లో కిలోమీటరుకు 10 పైసలు, మిగతా బస్సుల్లో కిలోమీటరుకు 20 పైసలు చొప్పున బస్సు ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. ఛార్జీల పెంపు అమలు తేదీని రేపు లేదా ఎల్లుండి ఆర్టీసీ ఎండీ ప్రకటిస్తారని మంత్రి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎన్‌కౌంటర్‌ స్థలిని పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ

చటాన్‌పల్లిలో దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశాన్ని జాతీయ మానవహక్కుల కమిషన్‌ బృందం పరిశీలించింది. మహబూబ్‌నగర్‌ జిల్లా ఆసుపత్రిలోని శవాగారంలో నిందితుల మృతదేహాలను నిశితంగా పరిశీలించిన అనంతరం చటాన్‌ పల్లి చేరుకుని తొలుత దిశ హత్య జరిగిన ప్రదేశం, ఆతర్వాత నిందితుల  ఎన్‌కౌంటర్‌ జరిగిన  ప్రాంతాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం పరిశీలించింది. బృందంలోని సభ్యులు.. శంషాబాద్‌ డీసీపీ ప్రతాప్‌రెడ్డిని అడిగి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆదాయపు పన్ను తగ్గిస్తారా?

ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఆదాయపు పన్ను హేతుబద్ధీకరణ అంశం కూడా అందులో ఒకటని చెప్పారు. ‘హిందుస్థాన్‌ టైమ్స్‌’ లీడర్‌ షిప్‌ సమ్మిట్‌లో శనివారం పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రజలపై పన్ను భారం తగ్గిస్తూ వ్యక్తిగత ఆదాయపు పన్ను హేతుబద్ధీకరిస్తారా అని ప్రశ్నించగా.. తాము పరిశీలిస్తున్న అనేక అంశాల్లో అదీ ఒకటి అని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు తప్పనిసరి: కేంద్రం

మహిళల భద్రతకు రాష్ట్రాలు అన్ని చర్యలు తీసుకోవాలని.. వారి భద్రతే ప్రభుత్వానికి ముఖ్య అంశమని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఇటీవల కాలంలో మహిళలపై చోటుచేసుకున్న అకృత్యాల నేపథ్యంలో ఈ లేఖ రాస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లా అందులో పేర్కొన్నారు. ‘‘ఈ జీరో ఎఫ్‌ఐఆర్‌ విషయంలో రాష్ట్రాలు పోలీసులకు ప్రత్యేక శిక్షణ నిర్వహించాలి. మహిళలకు సంబంధించిన కేసుల విషయంలో పోలీసులు తప్పనిసరిగా బాధ్యత తీసుకోవాలి’’ అని లేఖలో వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘వెంకీమామ’ ట్రైలర్‌ వచ్చేసింది

7. థాంక్యూ బిగ్‌బాస్‌: కోహ్లీ

‘ఛేదన రారాజు’ విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ విన్యాసానికి టీమిండియా తన చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. వెస్టిండీస్‌ నిర్దేశించిన 208 పరుగులను లక్ష్యాన్ని మరో 8 బంతులుండగానే ముగించింది. అతడి బ్యాటింగ్‌కు ముగ్ధులైన ఎంతోమంది అభినందిస్తూ ట్వీట్లు చేశారు. అందులో తాను ఆరాధించే వివియన్‌ రిచర్డ్స్‌ ప్రశంసకు పొంగిపోయిన కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు. విండీస్‌పై విజయం సాధించిన తర్వాత ‘అద్భుతం. అత్యద్భుతం కోహ్లీ..’ అని రిచర్డ్స్‌ ట్వీట్‌ చేశారు. దానికి కోహ్లీ ‘ధన్యవాదాలు బిగ్‌బాస్‌. మీ నుంచి ప్రశంసలంటే అవి నాకెంతో అమూల్యమైనవి’ అని తెలిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘ఎంత పిసినారివి ’: ఓ దొంగ ఆవేదన

దొంగతనానికి వచ్చిన ఓ దొంగకు ఆ ఇంట్లో ఏమి దొరకకపోవడంతో తీవ్ర నిరాశకు గురై ఇంటి యజమానికే లేఖ రాసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఆదర్శ్‌ నగీన్‌ నగర్‌లో పర్వేశ్‌ సోని అనే ప్రభుత్వ ఇంజినీర్‌ నివాసం ఉంటున్నారు. ఆయన బుధవారం రాత్రి పని మీద వేరే ఊరు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఓ దొంగ ఆ ఇంటిని దొంగతనానికి ఎంచుకున్నాడు. ఇంటి కిటీకి తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించి ఇళ్లు మొత్తం వెదికాడు. కానీ ఎక్కడ కూడా చిల్లిగవ్వ కూడా దొరకలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నిర్భయ దోషి క్షమాభిక్ష కోరలేదా..?

ఏడేళ్ల క్రితం దేశ రాజధానిలో చోటుచేసుకున్న నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన వినయ్‌ శర్మ క్షమాభిక్ష కోరలేదా.? ఈ విషయమై తాజాగా అతడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఓ దరఖాస్తు చేసుకున్నాడు. తన పేరుతో వచ్చిన క్షమాభిక్ష పిటిషన్‌ను తక్షణమే వెనక్కి పంపాలని పేర్కొన్నాడు. హోంశాఖ పంపిన పిటిషన్‌ను తాను దాఖలు చేయలేదని, దానిపై సంతకం కూడా చేయలేదన్నాడు. వినయ్‌ శర్మ పేరుతో వచ్చిన క్షమాభిక్ష పిటిషన్‌ను దిల్లీ ప్రభుత్వం తిరస్కరించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘దర్బార్‌’ ఆడియో విడుదల వేడుక


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.