close

తాజా వార్తలు

Published : 22/07/2020 20:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. రామమందిరం భూమిపూజకు 150 మంది అతిథులు

అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5న ప్రధాని మోదీ భూమిపూజ చేయనున్నారు. అయితే కరోనా మహమ్మారి ఉద్ధృతి దృష్ట్యా భౌతిక దూరం పాటించేందుకు ఎక్కువ మందిని ఆహ్వానించకూడదని శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టు నిర్ణయించింది. కేవలం 150 మంది అతిథులు సహా 200 మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొంటారని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. TS:ఆన్‌లైన్‌ తరగతులు, విద్యాసంవత్సరంపై నివేదిక

ఆన్‌లైన్‌ తరగతులు, విద్యా సంవత్సరంపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం నివేదిక సమర్పించింది. విద్యా సంవత్సరం ప్రారంభంపై ఇప్పుడే చెప్పలేమని ప్రభుత్వం పేర్కొంది. విద్యా సంవత్సరం ప్రారంభమనేది కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని నివేదికలో తెలిపింది. కరోనా తీవ్రత వల్ల చాలా రాష్ట్రాలు ఇంకా విద్యాసంవత్సరం ఖరారు చేయలేదని చెప్పింది. అనువైన విద్యాసంవత్సరం ఖరారు చేసే పనిలో ఉన్నామని కోర్టుకు విన్నవించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. భారత్‌లో ఒకేరోజు 28వేల మంది రికవరీ!

భారత్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ నిత్యం కోలుకుంటున్న వారిసంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24గంటల్లోనే దేశవ్యాప్తంగా 28,472 మంది కోలుకొని డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒకేరోజు ఈ స్థాయిలో కరోనా బాధితులు కోలుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 63.13శాతానికి పెరగగా, మరణాల రేటు 2.41శాతానికి పడిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ​​​​​​సుప్రీం కోర్టులో సచిన్‌ వర్గం పిటిషన్‌

రాజస్థాన్‌ రాజకీయం రసకందాయంలో పడింది. కాంగ్రెస్‌లో అసమ్మతి వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అటు స్పీకర్‌, ఇటు తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. సచిన్‌ పైలట్‌ సహా 19 మంది ఎమ్మెల్యేలపై శుక్రవారం వరకు ఎలాంటి చర్యలూ తీసుకోవద్దంటూ రాజస్థాన్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాజస్థాన్‌ స్పీకర్‌ సీపీ జోషి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఐజీఎస్టీ కమిటీలో హరీశ్‌రావుకు చోటు

ఐజీఎస్టీ పరిష్కారంపై నియమించిన మంత్రుల బృందంలో జీఎస్టీ మండలి మార్పులు చేసింది.  ఏడుగురితో కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కొత్త కమిటీలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు చోటు కల్పించింది. ఈ కమిటీకి కన్వీనర్‌గా బిహార్‌ ఆర్థికమం సుశీల్‌కుమార్‌ మోదీ నియమితులయ్యారు. ఐజీఎస్టీ పరిష్కారం, సంబంధిత అంశాలపై 2019 డిసెంబర్‌లో ఏర్పాటైన ఈ కమిటీలో మార్పులు చేస్తూ కార్యాలయం మెమోరాండం విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. బాలల హక్కుల సంఘం వ్యవస్థాపకుడు కన్నుమూత

బాలల హక్కుల సంఘం వ్యవస్థాపకుడు అచ్యుతరావు కన్నుమూశారు. కరోనా సోకి మలక్‌పేటలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాష్ట్ర బాలల హక్కుల ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. బాలకార్మికులకు సంబంధించిన అనేక పోరాటాలు చేపట్టారు. దశాబ్దాలుగా చిన్న పిల్లల సమస్యలపై పని చేశారు. సీపీఐ అనుబంధ బాలల సంఘంలోనూ చురుకైన పాత్ర పోషించారు.  పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఏపీలో కరోనా.. ఒక్కరోజే 65 మరణాలు

ఏపీలో కరోనా వైరస్‌ మహా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజురోజుకీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటం కలవరం రేపుతోంది. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 6045 పాజిటివ్‌ కేసులు, 65 మరణాలు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 64,713కి పెరిగింది.వీరిలో  823మంది ప్రాణాలు కోల్పోగా.. 32,127 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 31,763 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ఆ భవనాన్ని ఖాళీ చేయండి: డీఎంఈ

ఉస్మానియా ఆసుపత్రి పాత భవనాన్ని ఖాళీ చేసి సీజ్‌ చేయాలని డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల వర్షాలకు ఉస్మానియా ఆసుపత్రి పాత భవనంలోని గదుల్లోకి నీరు చేరిన విషయం తెలిసిందే. పాత భవనంలోని విభాగాలన్నీ వెంటనే ఖాళీ చేయాలని డీఎంఈ స్పష్టం చేశారు. పాత భవనంలోని రోగులను ఇతర వార్డుల్లోకి తరలించాలని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను డీఎంఈ ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. గవర్నర్‌ ఆదేశాలను స్వాగతిస్తున్నాం: చంద్రబాబు

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అంశంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్‌ ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. భారత రాజ్యాంగం గౌరవాన్ని, కోర్టుల ఔనత్యాన్ని నిలబెట్టడం సంతోషదాయకమని ట్విటర్‌ వేదికగా వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డను కొనసాగించాలని గవర్నర్‌ చెప్పడం ప్రజాస్వామ్య విజయమని మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి తెలిపారు. న్యాయవ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఐపీఎల్‌ కోసమే ప్రపంచకప్‌ వాయిదా: అక్తర్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కోసమే ఐసీసీ టీ20 పురుషుల ప్రపంచకప్‌ను వాయిదా వేశారని పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు షోయబ్‌ అక్తర్‌, రషీద్‌ లతీఫ్‌ ఆరోపించారు. ఆర్థికంగా లాభపడటం కోసమే బోర్డులన్నీ ఇందుకు అంగీకరించాయని పేర్కొన్నారు. జియో క్రికెట్‌ చర్చలో వారు మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.