ఓ రెండు బిలియన్లు ఇవ్వండి..!
close

తాజా వార్తలు

Updated : 15/11/2020 18:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓ రెండు బిలియన్లు ఇవ్వండి..!

 చైనా వద్ద మరోసారి చెయ్యి చాపిన పాక్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ మరోసారి చైనా వద్ద చెయ్యి చాపింది. తమ దేశంలో నిర్మిస్తున్న చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ పాక్యేజీ 1లోని మెయిన్‌లైన్‌1(ఎంఎల్‌1) నిర్మాణ ఖర్చుల కోసం అప్పు అడిగింది. ఇటీవల పాకిస్థాన్‌లోని ఎంఎల్‌-1 ప్రాజెక్టు అప్‌గ్రేడింగ్‌ సమావేశం జరిగింది. దీనిలో ఈ ప్రాజెక్టులోని 1,872 కిలోమీటర్ల మేరకు  కరాచీ-పెషావర్‌ రైల్వేలైన్‌ అప్‌గ్రేడింగ్‌కు చైనాను 2.73 బిలియన్‌ డాలర్లు అప్పు అడగాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని పాక్‌ పత్రిక ది ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ పేర్కొంది. కొవిడ్‌-19, అంతర్జాతీయ ఆంక్షల కారణంగా పాక్‌ ఆర్థిక వ్యవస్థ దివాలా అంచులకు చేరింది. ఇదే సమయంలో రుణం కోసం చైనాకు లేఖ రాయాలని నిర్ణయించారు. సీపెక్‌కు సంబంధించి వచ్చే ఏడాది కేటాయింపులను డ్రాగన్‌ ఖరారు చేయనుంది. 

వడ్డీపై నోరుమెదపని చైనా..

ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిబంధనల ప్రతిని ఈ ఏడాది ఏప్రిల్‌లో పాకిస్థాన్‌ విడుదల చేసింది. దీనిలో చైనా 1శాతం వడ్డీకే రుణాలను ఇవ్వాలని కోరింది.  అయితే ఇప్పటి వరకు వడ్డీ విషయంలో చైనా అధికారికంగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అనధికారికంగా మాత్రం ఆ రేటుకు ఇవ్వలేమని.. అంతకంటే ఎక్కువే ఉండవచ్చని చైనా అధికారులు పేర్కొన్నారు. దాదాపు 62 బిలియన్‌ డాలర్లతో చేపట్టిన సీపెక్‌ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని పాక్‌ మాజీ రాయబారి హుస్సెన్‌ హక్కానీ ఆరోపించారు.

అవినీతి పవర్‌..!

పాకిస్థాన్‌కు వ్యూహాత్మక పరమైన మద్దతు చైనా నుంచి లభిస్తోంది. అమెరికా అందించే సాయం చాలా నిబంధనలతో కూడి ఉంటుంది. అందుకే పాక్‌ సైన్యం చైనా వైపు మొగ్గు చూపుతుంది. కానీ, చైనా మాత్రం దీనిని పూర్తి స్థాయిలో వాడుకొని పాక్‌ను పీల్చిపిప్పి చేసే వ్యూహాలను అమలు చేస్తుంది. పాక్‌లోని  కమిటీ ఫర్‌ పవర్‌ సెక్టార్‌ సంస్థ ఇటీవల ఒక నివేదికను సమర్పించింది. ఆ దేశ విద్యుత్తు రంగంలో 10వేల కోట్ల పాకిస్థానీ రూపాయల మేరకు అవినీతి జరిగిందని పేర్కొంది. దీనిలో మూడోవంతు చైనా చేపట్టిన ప్రాజెక్టుల్లోనే ఉందని వెల్లడించింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని