close

తాజా వార్తలు

Published : 17/11/2020 15:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాకు పారిపోవడం తెలియదు: పవన్‌

మంగళగిరి: అధికారం అంతిమలక్ష్యం వేల కోట్ల రూపాయలను కూడగట్టుకోవడం కాదని.. ప్రజలు కోల్పోయిన వాటిని అందించడమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన కార్యాలయంలో 5 జిల్లాల నేతలతో సమావేశమైన జనసేనాని భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సమస్యను ఎత్తి చూపితే వ్యక్తిగత దూషణకు పాలకులు పాల్పడటం మంచిది కాదని హితవు పలికారు. సమస్య వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలనేది పాలకులు ఆలోచించుకోవాలన్నారు. పాలకులు పరిస్థితులకు అనుగుణంగా మాటలు మార్చుతున్నారని.. అమరావతి విషయంలోనూ అదే జరిగిందని పవన్‌ వ్యాఖ్యానించారు. విభజించి పాలించే విధానంతో నేతలు ముందుకు వెళ్తున్నారని ఆక్షేపించారు. తనకు పారిపోవడం తెలియదని.. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. అభిప్రాయం చెప్పాల్సి వచ్చినప్పుడు తప్పకుండా చెబుతానని పవన్‌ కల్యాణ్‌ వివరించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన