close

తాజా వార్తలు

Published : 02/05/2020 00:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా లక్షణాలు లేకుంటేనే ప్రయాణం!

వలస కూలీల తరలింపుపై రైల్వే శాఖ మార్గదర్శకాలు
ఆరు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు

దిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో వివిధ ప్రాంతాల్లో చిక్కున్న వలస కూలీలు, యాత్రికులు, విద్యార్థులు, ఇతరులను తరలించేందుకు ‘శ్రామిక్‌ స్పెషల్‌’ పేరిట ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. శ్రామిక దినోత్సవాన్ని పురస్కరించుకుని నేటి నుంచే ఈ రైళ్లు నడుపుతున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆరు రైళ్లను ప్రకటించింది. లింగంపల్లి -హతియా, నాసిక్‌- లక్‌నవూ, అలువా- భువనేశ్వర్‌, నాసిక్‌- భోపాల్‌, జైపూర్‌-పట్నా, కోట- హతియాకు రైళ్లు నడపునున్నట్లు తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం మాట్లాడుకుని, రైల్వే శాఖతో సంప్రదింపులు జరిపితే ఒక చోటు నుంచి ఇంకో చోటుకు రైళ్లు నడుపుతారు. శ్రామిక్‌ రైళ్లు నడిపేందుకు ఎలాంటి అవాంతరాలూ లేకుండా, సమన్వయం కోసం రైల్వే శాఖతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సీనియర్‌ అధికారులను నోడల్‌ అధికారులుగా నియమించాలని రైల్వే శాఖ పేర్కొంది. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులను అనుసరించి రైల్వే మంత్రిత్వ శాఖ కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది.

* శ్రామిక్‌ రైళ్లలో ప్రయాణించే వారిని ప్రారంభ స్టేషన్‌లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్క్రీనింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది. కొవిడ్‌ -19 లక్షణాలు లేనివారినే ప్రయాణానికి అనుమతిస్తారు.

*దీనికోసం రైల్వేశాఖ స్లీపర్‌ క్లాస్ టికెట్‌ ధరతో పాటు సూపర్‌ఫాస్ట్‌ ఛార్జీ రూ.30, అదనంగా రూ. 20 భోజనం, తాగునీటి కోసం వసూలు చేయనుంది. ఈ మొత్తాన్ని ప్రయాణికుల తరపున రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వేశాఖకు చెల్లించనున్నాయి. ప్రతి రైల్లో దాదాపు వెయ్యి నుంచి పన్నెండు వందల మంది ప్రయాణించే అవకాశం ఉందని అంచనా. 
* రైల్వేస్టేషన్‌కు వ్యక్తులను తరలించేందుకు శానిటైజ్‌ చేసిన బస్సులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించాలి. భౌతిక దూరాన్ని పాటించాలి.
* ప్రతి ప్రయాణికుడూ ఫేస్‌ మాస్కు ధరించడం తప్పనిసరి.
* ప్రయాణికులను పంపించే ప్రభుత్వాలే వారి ఆహారం, మంచినీరు ఏర్పాటు చేయాలి. 
* దూర ప్రయాణం చేసే వారికి మధ్యలో అవసరమయ్యే ఆహారాన్ని రైల్వే శాఖ ఏర్పాటు చేస్తుంది.
* రాష్ట్రాలకు చేరుకునే ప్రయాణికుల బాధ్యతను సంబంధిత రాష్ట్రప్రభుత్వం తీసుకుని వారికి స్క్రీనింగ్‌ చేపట్టాలి. అవసరమైతే క్వారంటైన్‌కు పంపాలి.
*  రైల్వే స్టేషన్‌ నుంచి వారి వారి స్వస్థలాలకు చేరుకునేందుకు రవాణా సదుపాయం ఏర్పాటు చేయాలి.

ఇవీ చదవండి..

కూలీల తరలింపునకు ప్రత్యేక రైళ్లు.. కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

టి-కణాలు తగ్గితే కరోనా తీవ్రరూపం


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని