మీ రైలు టికెట్‌ డబ్బులు సోనియమ్మ చెల్లించారు!
close

తాజా వార్తలు

Published : 12/05/2020 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీ రైలు టికెట్‌ డబ్బులు సోనియమ్మ చెల్లించారు!

రైల్వే స్టేషన్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రసంగం, కరపత్రాల పంపిణీ

ముంబయి: ‘మీ రైలు టికెట్టుకు డబ్బులు సోనియాగాంధీ చెల్లించారు’ అని ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రచారం చేశారు. రైల్వే స్టేషన్‌లో వలస కూలీలకు కరపత్రాలు సైతం పంచారు. పంజాబ్‌లోని భటిండా రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

పంజాబ్‌లోని వలస కూలీల రైలు బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ బయల్దేరే ముందు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అమరిందర్‌ రాజా వారింగ్‌ రైల్వే స్టేషన్‌కు తన అనుచరులతో కలిసి వచ్చారు. అయితే వారు స్వస్థలాలకు వెళ్లేందుకు ఎవరు సాయం చేశారో వివరించాలని భావించారు. వలస కూలీల ముందు ప్రసంగించారు.

‘మీ టికెట్‌ డబ్బులను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ చెల్లించారు. కాంగ్రెస్‌ పార్టీ, పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌, సునిల్‌ జాఖడ్‌ (పీసీసీ అధ్యక్షుడు) మిమ్మల్ని స్వస్థలాలకు పంపిస్తున్నారు. ప్రతిదీ ఆ కరపత్రంలో రాశాం. ప్రయాణిస్తున్న దానిని చదువుకోవచ్చు’ అని వారింగ్‌ అన్నారు. ఆ కరపత్రానికి ‘ఈ ఆపత్కాలంలో కాంగ్రెస్‌ ముందుకొచ్చింది’ అని శీర్షిక పెట్టారు.

వలస కూలీల కోసం రైల్వేశాఖ ‘శ్రామిక్‌ ఎక్స్‌ప్రెస్‌’ రైళ్లను నడిపిస్తోంది. 85% రుసుమును కేంద్రం భరిస్తుండగా 15% రాష్ట్రాలను భరించాలని కోరింది. ఒక్కో వ్యక్తికి రూ.50 చొప్పున రాష్ట్రాలే చెల్లించాలని వివరించింది. ఈ నేపథ్యంలో వలస కూలీల నుంచి టికెట్‌ రుసుములు వసూలా చేస్తారా అంటూ అందుకు అయ్యే ఖర్చు కాంగ్రెస్‌ రాష్ట్ర శాఖలు భరిస్తాయని సోనియా గాంధీ చెప్పారు. కానీ రైల్వే శాఖ కూలీల దగ్గర్నుంచి డబ్బులు వసూలు చేయడం లేదన్న సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి

వీటినే కొవిడ్‌-19 మరణాలుగా గుర్తించాలి

కర్నూలులో కేంద్ర బృందం పర్యటన


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని