close

తాజా వార్తలు

Updated : 26/07/2020 07:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కట్టుకున్న భార్యను కాపాడేందుకు అతడేం చేశాడు!

ముంబయి: మార్చి 2008. అమెరికాలో మొదలైన ఆర్థిక వ్యవస్థ పతన ప్రభావం ప్రపంచ దేశాలపైనా పడింది. అనేక దేశాలు ఆర్థికమాంద్యం కోరల్లో చిక్కుకున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ భార్యభర్తలను ఒక ప్రకటన ఆకర్షించింది. నొమాన్‌ ఆయిల్‌ బావుల్లో ఉద్యోగం. మొదట భార్యకు ఉద్యోగం వచ్చింది. కొన్ని రోజుల్లో భర్త కూడా అక్కడకు వెళ్లాల్సి ఉంది. సరిగ్గా అదే సమయంలో నొమాన్‌ వెళ్లిన భార్య నుంచి ఏడుస్తూ ఫోన్‌.. ‘సమీర్‌.. నన్ను ఇక్కడి నుంచి ఇంటికి తీసుకు పో’ అంతే.. భర్త నొమాన్‌కు బయలుదేరాడు? అక్కడకు వెళ్లిన సమీర్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అతని భార్య నర్గీస్‌కు ఎలాంటి కష్టం వచ్చింది? నొమాన్‌ చేరిన సమీర్‌ తన భార్య నర్గీస్‌ను కనుగొన్నాడా? అది తెలియాలంటే ‘ఖుదా హాఫీజ్‌’ చూడాల్సిందే!

విద్యుత్‌ జమ్వాల్‌, శివలేఖ ఒబెరాయ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వేసవి కానుకగా విడుదల కావాల్సి ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని డిస్నీ+ హాట్‌స్టార్‌ వేదికగా ఆగస్టు 14న విడుదల చేయనున్నారు. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా ట్రైలర్‌ సాగింది. ఫారుఖ్‌ కబీర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిథున్‌ సంగీతం అందిస్తున్నారు. విద్యుత్‌ జమ్వాల్‌ అంటే యాక్షన్‌కు పెట్టింది పేరు. ఈ సినిమాలోనూ అదే స్థాయిలో పోరాట ఘట్టాలు ఉన్నాయి.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

Panch Pataka

దేవతార్చన