close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120061249 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => KNuj1c5hM8E [video_short_link] => KNuj1c5hM8E [created_by] => [created_date] => [modified_by] => 8925327 [modified_date] => 2020-05-07 13:17:57.776926 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 07/05/2020 13:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏమిటీ ‘స్టైరీన్‌’ గ్యాస్‌..?పీలిస్తే ఏమవుతుంది..

విశాఖ: ప్రస్తుతం విశాఖలోని గోపాలపట్నంలో మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న విషవాయువు ‘స్టైరీన్‌’‌. గురువారం తెల్లవారుజామున ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో ఓ భారీ ప్రమాదం చోటుచేసుకోవడంతో ‘స్టైరీన్‌’ అనే గ్యాస్‌ లీక్‌ అయ్యింది. దీంతో ఆ గాలిని పీల్చిన ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే తొమ్మిది మంది మృతి చెందగా, దాదాపు 200 తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ప్రజలను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్న ‘స్టైరీన్‌‌’ను ఎందుకు వాడతారు?ఆ గ్యాస్‌ ప్రజలపై ఏవిధంగా ప్రభావం చూపిస్తుంది..!!

విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధిలో గల ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలో 1997లో ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీని నెలకొల్పారు. దాదాపు 213 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కంపెనీలో రోజూ 417 టన్నుల పాలిస్టిరిన్‌ ఉత్పత్తి జరుగుతుంది. అయితే స్టైరీన్‌ అనే గ్యాస్‌ను ముడిసరకుగా పాలిస్టిరిన్‌ను తయారు చేస్తారు. తాజాగా పాలిమర్స్‌లో చోటుచేసుకున్న ప్రమాదంలో స్టైరీన్‌ గ్యాస్‌ లీక్‌ అయ్యింది. ఈ గ్యాస్‌ను పీల్చడం వల్ల తలనొప్పి, వినికిడి సమస్య, నీరసం, కళ్లు మంటలు వంటివి ప్రథమంగా కనిపిస్తాయి. ఒకవేళ ఎవరైనా ఈ గ్యాస్‌ అధిక మోతాదులో పీలిస్తే క్యాన్సర్‌, కిడ్నీ సమస్యలతోపాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రమాదానికి గురైన వ్యక్తిని వెంటనే ప్రమాదస్థలి నుంచి వేరే ప్రాంతానికి తీసుకువెళ్లాలి. శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు తలెత్తితే సదరు వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సను అందించాలి. గతంలో కూడా ఎల్‌జీ పాలిమర్స్‌లో ఇలాంటి ప్రమాదమే చోటుచేసుకున్నప్పటికీ సదరు కంపెనీ అప్రమత్తం కావడంతో అప్పటికప్పుడు ఆ ప్రమాదాన్ని అరికట్టింది.

‘‘లాక్‌డౌన్‌ కారణంగా 45 రోజుల నుంచి పరిశ్రమలో ఎలాంటి పనులు జరగకపోవడంతో స్టైరీన్‌ను నిల్వ ఉంచే చోట ఒత్తిడి పెరిగి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మిగిలిన గ్యాస్‌ వాయువులతో పోలిస్తే ఇది చాలా బరువైన వాయువు. ఈ ప్రమాదం జరిగిన చోట 0.5 కిలోమీటర్ల పరిధిలో గాలి చాలా ఘాటుగా ఉంటుంది. అలాగే 3 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు కొంతవరకూ అస్వస్థతకు గురి అవుతారు. అయితే ఈ గ్యాస్‌ ప్రభావం ఒకటి, రెండు రోజుల వరకూ ఉంటుంది. స్టైరీన్‌ గ్యాస్‌ను పీల్చడం వల్ల ముక్కు, గొంతు దురదపెట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడం జరుగుతుంది. అలాగే జీర్ణాశయంపై కూడా దీని ప్రభావం ఉంటుంది. ఒకవేళ గ్యాస్‌ను కనుక అధిక మోతాదులో పీలిస్తే ఆరోగ్యపరంగా ఎక్కువగా ఇబ్బంది ఎదురవుతుంది’’ -ఐ.ఐ.పి.ఈ డైరెక్టర్‌ ప్రసాద్‌

 

 

 

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.