close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 02/07/2020 16:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

త్వరలో వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు  

ఇంటర్నెట్‌డెస్క్‌: త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన ఫీచర్లను తీసుకొస్తున్నట్లు వాట్సాప్‌ ప్రకటించింది. ఆండ్రాయిడ్‌, డెస్క్‌టాప్‌, వెబ్‌ మోడ్‌లలో ఇవి రానున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఈ మెసేజింగ్‌ దిగ్గజం యానిమేటెడ్‌ స్టిక్కర్లను, వాట్సాప్‌లో క్యూఆర్‌ కోడ్స్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు గ్రూప్‌ వీడియో కాల్స్‌ సౌకర్యానికి మెరుగులు దిద్దింది. వాట్సాప్‌ వెబ్‌, డెస్క్‌టాప్‌ క్లైంట్లకు డార్క్‌మోడ్‌ను అందుబాటులోకి తెచ్చింది. కాయ్‌ ఓఎస్‌కు స్టేటస్‌ ఫీచర్‌ను ఇచ్చింది. ఈ ఫీచర్లు మరికొన్ని రోజుల్లో వాట్సాప్ కొత్త వెర్షన్‌ ద్వారా విడుదలవుతాయి.  

* యానిమేటెడ్‌ స్టిక్కర్ల ద్వారా సంభాషణల్లో మరింత చతురతను పెంచుతుంది. కొత్త వెర్షన్‌ అప్‌డేట్‌ అయితే ఈ ఫీచర్‌ చేరుతుంది.

* ఈ ఫీచర్‌లో కోడ్‌ను స్కాన్‌ చేసి కాంటాక్ట్‌లను చేర్చుకోవచ్చు.

* వాట్సాప్‌ డార్క్‌మోడ్‌ డెస్క్‌టాప్‌లకు కూడా చేరుతుంది.

* ఇక గ్రూప్‌ వీడియోకాల్స్‌లో ఒకేసారి 8మంది మాట్లాడుకోవచ్చు. గతంలో ఈ సంఖ్య కేవలం నాలుగు మాత్రమే.

* ఇక జియోఫోన్‌లో వినియోగించే కాయ్‌ ఓఎస్‌కు స్టేటస్‌ ఫీచర్‌ను జత చేసింది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.