అమరావతి తహసీల్దార్‌పై సస్పెన్షన్‌ వేటు
close

తాజా వార్తలు

Published : 17/03/2021 20:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమరావతి తహసీల్దార్‌పై సస్పెన్షన్‌ వేటు

కలెక్టరేట్ ‌(గుంటూరు): అమరావతి మండల తహశీల్దార్‌, ఈవోపీఆర్డీలను సస్పెండ్‌ చేస్తూ గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతి మండలంలోని ధరణికోట, లింగాపురం గ్రామాల్లో ఉప సర్పంచ్‌ ఎన్నిక నిర్వహించటంలో అలసత్వం వహించినందుకు వారిని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులిచ్చారు. 

ఇటీవల ధరణికోటలో ఉప సర్పంచ్‌ ఎన్నిక జరుపుతున్న క్రమంలో చోటు చేసుకున్న వివాదాన్ని తహసీల్దార్‌, ఈవోపీఆర్డీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాలేదు. ఈ క్రమంలో విధుల పట్ల అలసత్వం వహించినందుకు అమరావతి మండల తహశీల్దార్‌ ఎ.శ్రీనివాసరావు, ఈవోపీఆర్డీ కె.శ్రీనివాసరావును సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులిచ్చినట్లు అధికారులు తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని