close

తాజా వార్తలు

Published : 29/11/2020 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జ్యోతిరావు పూలే పోరాటం ఓ చరిత్ర: జగన్‌

అమరావతి: బడుగు బలహీనవర్గాలు, అణగారిన ప్రజల హక్కుల సాధనకోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు కె.పార్థసారథి, జోగి రమేష్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడిగా జ్యోతిరావు పూలే చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అణగారిన వర్గాలకు సమాన హక్కు ఉండాలంటూ జ్యోతిరావు పూలే పోరాడారని గుర్తు చేశారు. బలహీన వర్గాల్లో మహిళలు చదువుకోవాలని ఆరాటపడిన వ్యక్తి పూలే అని కొనియాడారు.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని