Apollo: 18ఏళ్లు పైబడిన వారికి  నేటి నుంచి టీకా
close

తాజా వార్తలు

Updated : 01/05/2021 02:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Apollo: 18ఏళ్లు పైబడిన వారికి  నేటి నుంచి టీకా

హైదరాబాద్: 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల వయసు కలిగిన వారికి  నేటి నుంచి(శనివారం) టీకాలు వేయనున్నట్టు అపోలో, మ్యాక్స్‌ ఆస్పత్రులు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారు టీకా వేసుకొనేందుకు కేంద్రం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. టీకా డోసులు కొరతతో ఆయా వయసుల వారికి వ్యాక్సినేషన్‌ను నేటి నుంచి ప్రారంభించలేకపోతున్నామంటూ ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తమ ఆస్పత్రుల్లో పరిమిత సంఖ్యలో టీకా పంపిణీ చేయనున్నట్టు అపోలో ప్రకటించింది. రానున్న వారాల్లో మరింతగా దీన్ని పెంచుతామని తెలిపింది. కార్పొరేట్‌ కంపెనీల కోసం ప్రత్యేక క్యాంపులు కూడా నిర్వహించనున్నట్టు అపోలో ఓ ప్రకటనలో పేర్కొంది. కొవిషీల్డ్‌ డోసులను పంపిణీ చేస్తామని తెలిపింది.

సెకండ్‌ వేవ్‌ ఓ సునామీలా విరుచుకుపడుతుండటంతో భారీ సంఖ్యలో కొత్త కేసులు వస్తున్నాయని అపోలో ఆస్పత్రుల గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ శోభన కామినేని అన్నారు. ఈ వైరస్‌ తక్కువ వయస్సు ఉన్నవారిపైనా ప్రభావం చూపిస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయడం వల్ల వైరస్‌ ఉద్ధృతిని అడ్డుకోవడానికి, కరోనా రహిత సమాజానికి దోహదపడుతుందన్నారు.

తాము కూడా 18 ఏళ్లు పైబడిన వారికి ఇవాళ్టి టీకాలు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు మ్యాక్స్‌ ఆస్పత్రి వెల్లడించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని