బౌన్సర్లు రద్దు చేస్తే ఆటగాళ్లకు మరింత ప్రమాదం
close

తాజా వార్తలు

Published : 29/01/2021 02:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బౌన్సర్లు రద్దు చేస్తే ఆటగాళ్లకు మరింత ప్రమాదం

లండన్‌: 18 ఏళ్లలోపు క్రికెటర్లకు బౌన్సర్లు రద్దు చేయాలనే ప్రతిపాదనను ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ ఖండించాడు. అలా చేస్తే యువ క్రికెటర్లకు మరింత ప్రమాదమని పేర్కొన్నాడు. పురుషుల క్రికెట్‌లో నేరుగా షార్ట్‌పిచ్‌ బంతులను ఎదుర్కొనేలా చేయడం బ్యాట్స్‌మెన్‌కు మంచిది కాదన్నాడు. ఇటీవల మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌(క్రికెట్‌ నియమ నిబంధనలు అమలుచేసేది) ఆటగాళ్లకు బౌన్సర్లను అనుమతించాలా వద్దా అనే విషయంపై చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలోనే ఇంటర్నేషనల్‌ కంకషన్‌ అండ్‌ హెడ్‌ ఇంజురీ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ సంస్థ ఇటీవల అండర్‌-18 ఆటగాళ్లకు బౌన్సర్లు వేయకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. దీర్ఘకాలంలో ఇబ్బందులు ఎదురవ్వద్దనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ప్రతిపాదించింది. 

అయితే, వాన్‌ ఈ ప్రతిపాదనను కొట్టిపారేశాడు. ఇది మరో పనికిమాలిన ప్రతిపాదనగా అభివర్ణించాడు. ప్రస్తుత ప్రపంచంలో ఏది రిస్క్‌ అని అనిపించినా దాన్ని మరింత ప్రమాదకరంగా చూపిస్తున్నారనడానికి ఇదో ఉదాహరణ అని పేర్కొన్నాడు. పిల్లలకు ఇది మరింత ప్రమాదం. అత్యున్నత స్థాయిలో వారిని నేరుగా షార్ట్‌పిచ్‌ బంతులు ఎదుర్కోమంటే వాటిని ఆడటానికి సిద్ధంగా ఉండరు. జూనియర్‌ స్థాయిలో బౌలర్లు షార్ట్‌పిచ్‌ బంతులను తక్కువ ఎత్తులో వేస్తారు. బౌన్సర్లు వేసే అంత శక్తి సామర్థ్యాలు వారికి ఉండవు. యువ క్రికెటర్లు షార్ట్‌ బాల్స్‌ ఆడటం కూడా నేర్చుకోవాలి. ఒకవేళ జూనియర్‌ స్థాయిలో బౌన్సర్లను రద్దు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లోనూ తొలగించాలి’ అని వాన్‌ సూచించాడు. 

ఇవీ చదవండి..
బౌలర్లు బౌండరీలు ఇస్తే.. శాస్త్రి అరిచేస్తాడు
మిథాలి రాజ్‌గా బ్యాటింగ్‌ చేస్తున్న తాప్సీ 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని