close

తాజా వార్తలు

Updated : 16/01/2021 14:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కిష్టమ్మ చెప్పిన తొలి టీకా ముచ్చట!

హైదరాబాద్‌: తెలంగాణలో కొవిడ్‌ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. టీకా కోసం కొన్ని నెలలుగా ప్రజలు ఎదురు చూస్తున్నప్పటికీ వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తుతాయోనని పలువురు సందిగ్ధంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో తెలంగాణలో తొలి టీకా వేయించుకున్న పారిశుద్ధ్య కార్మికురాలు కిష్టమ్మ తన వ్యాక్సిన్‌ అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.

‘‘టీకా వేయించుకుంటానంటే తొలుత మా పిల్లలు వద్దన్నారు. వ్యాక్సిన్‌ వేయించుకునే వారి జాబితాలో మొదటి పేరు నాదే ఉంది. టీకా తీసుకుంటానని చెప్పా. నేను టీకా వేయించుకుంటే మిగిలిన వారు కూడా ధైర్యంగా ఉంటారని భావించా. గత వారం రోజుల నుంచీ ..టీకా అంటున్నారు ఏమవుతుందోనని ఆసుపత్రిలో పనిచేస్తున్న తోటి సిబ్బంది అంతా ఆందోళనకు గురయ్యాం. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ మాతో రెండు సార్లు సమావేశమై ధైర్యం చెప్పారు. ఎలాంటి భయం వద్దని, తాను అండగా ఉంటానన్నారు. 24 గంటలూ ఇక్కడే ఉంటానని, మీకేదైనా జరిగితే నాది బాధ్యత అని పూర్తి భరోసా ఇచ్చారు. ఈరోజు నేను టీకా తీసుకున్నా.. నా ఆరోగ్యం బాగానే ఉంది. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత అర్ధగంట అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఎలాంటి సమస్యలూ లేవు. అందరూ ఎలాంటి భయం లేకుండా టీకా తీసుకోవాలని కోరుతున్నా’’ అని కిష్టమ్మ తెలిపారు.

ఇవీ చదవండి..
ప్రధాని సూచన మేరకే ఆ నిర్ణయం: కేటీఆర్‌

టీకా వేయించుకున్న సీరమ్‌ అధినేత




Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని