close

తాజా వార్తలు

Published : 26/02/2021 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమ్మ పాలు... నిండు నూరేళ్ల్లు!

అమ్మపాలు ఆరోగ్యమని మనందరికీ తెలుసు. అవి బిడ్డ ఎదుగుదలకు పోషకాల్ని అందించడమే కాదు...వారి ఆయుష్షునీ, ఆరోగ్యాన్నీ కూడా పెంచుతాయి. ఈ విషయాలనే నొక్కి చెబుతూ తమ పరిశోధనతో మరిన్ని కొత్త విషయాలను తెలుసుకున్నారు మాంట్రియల్‌, గ్వాటెమాలకు చెందిన పరిశోధకులు.

ల్లిపాలు ఎక్కువకాలం తాగే పిల్లల్లో ఇన్‌ఫెక్షన్లు, మరణాల ముప్పు తక్కువ. చనుబాలలో ప్రత్యేకంగా ఉండే హ్యూమన్‌ ఒలిగోసాకరైడ్లు(చక్కెరలు) పేగులో హానికారక బ్యాక్టీరియాను తగ్గించి మంచి వాటిని వృద్ధి చెందేలా చేస్తాయి. ఈ మంచి బ్యాక్టీరియా బిడ్డ ఆరోగ్యానికి రక్షణ గోడలా నిలబడుతుందంటోంది ఈ అధ్యయనం. హైరెజల్యూషన్‌ ఇమేజింగ్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిశోధకులు తల్లిపాల నమూనాల్ని విశ్లేషించారు. ఇందుకోసం గ్వాటెమాల -వెస్ట్రన్‌ హైల్యాండ్స్‌ పరిసరాల్లో నివసిస్తున్న మామ్‌-మయాన్‌కు చెందిన ఎనిమిది వర్గాల బాలింతల్ని ఈ పరిశోధనకు ఎంచుకున్నారు. మొదటి(4-6), చివరి(109-184)రోజుల తల్లిపాలను ఆరునెలలపాటు పరీక్షించారు. కాలం గడిచే కొద్దీ సూక్ష్మజీవుల్లో వచ్చే మార్పులను తెలుసుకున్నారు. కొత్త సూక్ష్మజీవుల జాతులనూ గుర్తించారు. అలానే మంచి బ్యాక్టీరియా... శిశువుల జీర్ణాశయం, పేగులను కాపాడుతూ... అలర్జీలను అదుపులో ఉంచుతోందంటున్నారు. గుర్తింపులేని పరాన్నజీవుల్ని నాశనం చేయడంలోనూ, విషపదార్థాలూ, ఇతర కాలుష్య కారకాల నుంచి ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ మంచి బ్యాక్టీరియా కీలకంగా పనిచేస్తుందని చెబుతున్నారు. ఈ పరిశోధన మనుషుల్లోని వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడానికీ, విభిన్న వర్గాలకు చెందిన సూక్ష్మజీవుల పనితీరుని తెలుసుకోవడానికి వీలవుతుందని వెల్లడిస్తున్నారు. ఈ వివరాలన్నీ ‘ఫ్రాంటియర్స్‌ ఇన్‌ మైక్రోబయాలజీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని