close

తాజా వార్తలు

Published : 09/01/2020 18:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రీజనల్‌ పోటీలు ప్రారంభం.. తొలి రోజు హోరాహోరీ

ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌-2019 ప్రాంతీయ పోటీలు ప్రారంభం

వరంగల్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: ఈనాడు, స్ప్రైట్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌ -2019 ప్రాంతీయ పోటీలు వరంగల్‌ కేంద్రంగా ప్రారంభమయ్యాయి. హన్మకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల క్రీడా మైదానంలో ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన క్రికెట్‌ జట్లు హాజరయ్యాయి. జూనియర్, డిగ్రీ కళాశాలలకు చెందిన క్రికెటర్లు ప్రాంతీయ టోర్నీలో విజయం కోసం హోరాహోరీగా తలపడ్డారు. తొలిరోజు జరిగిన మ్యాచుల్లో నిట్‌ వరంగల్‌ జట్టు క్రికెటర్‌ కిరీటి అద్భుతమైన బ్యాటింగ్‌లో, ఆదిలాబాద్‌ ఐఐఐటీ బాసర జట్టులో దేవేందర్‌ బౌలింగ్‌లో రాణించి జట్టు విజయంలో కీలకప్రాత పోషించారు. మరో మ్యాచ్‌లో వరంగల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ జట్టుకు వాకోవర్‌ లభించింది. కిట్స్‌ వరంగల్‌ కాలేజీ వ్యాయామ విద్య ఆచార్యులు పింగిళి రమేష్‌రెడ్డి ప్రారంభ వేడుకలకు హాజరై మాట్లాడారు. క్రీడాకారులు ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌ వేదికను ఉపయోగించుకొని  క్రీడా నైపుణ్య ప్రతిభను కనబర్చాలని సూచించారు. 

శాంతినికేతన్‌ డిగ్రీ కాలేజీ, మిర్యాలగూడ జట్టు జయకేతనం 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శాంతినికేతన్‌ డిగ్రీ కాలేజీ, మిర్యాలగూడ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 101 పరుగులు నమోదు చేసింది. జట్టులో అవినాష్‌ 38, మహేష్‌ 20, శేఖర్‌ 12 పరుగులు చేశారు. ఛేదనకు దిగిన వివేకానంద డిగ్రీ, పీజీ కాలేజీ కరీంనగర్‌ జట్టు 17.4 ఓవర్లలో 10 వికెట్లు సమర్పించి 66 పరుగులకే కుప్పకూలింది. జట్టులో వినయ్‌ 9, ప్రశాంత్, అరుణ్‌ 8 చొప్పున  మాత్రమే అత్యధిక పరుగులు చేశారు. దీంతో వివేకానంద డిగ్రీ కాలేజీ జట్టుపై 35 పరుగుల తేడాతో శాంతినికేతన్‌ జట్టు జయకేతనం ఎగురవేసింది. శాంతినికేతన్‌ బౌలర్లు మహేష్‌ 3, జాకీరుద్దీన్‌ 2 వికెట్లు తీసి రాణించారు.

 5 వికెట్ల తేడాతో ఐఐఐటీ బాసర జట్టు విజయం 

వాగ్దేవి డిగ్రీ కాలేజీ, నిజామాబాద్‌ జట్టుపై ఐఐఐటీ బాసర, ఆదిలాబాద్‌ జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వాగ్దేవి జట్టు 18.5 ఓవర్లు ఆడి 78 పరుగులు వద్ద ఆలౌట్‌ అయింది. జట్టులో సుమంత్‌ 20, వంశీ 17 పరుగులు చేశారు. తర్వాత బరిలోకి దిగిన ఐఐఐటీ బాసర జట్టు 12.4 ఓవర్లలో 5 వికెట్లు నష్టంతో 79 పరుగుల విజయ లక్ష్యాన్ని సులువుగా అందుకుంది. జట్టులో సందీప్‌ 20, సాయిరాం 13(నాటౌట్‌)పరుగులు చేశారు. బాసర జట్టు బౌలర్‌ దేవేందర్‌ 4, మహేష్‌ 2 వికెట్లు పడగొట్టారు. 

నిట్‌ వరంగల్‌ జట్టు ఘన విజయం 

నువ్వా నేనా అంటూ సాగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కాలేజీ, ఖమ్మం జట్టుపై నిట్‌ వరంగల్‌ జట్టు 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన నిట్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టంతో 132 పరుగులు చేసింది. జట్టులో కిరీటి 45, సంకేత్‌ 22, మనీష్‌ 21 పరుగులతో రాణించారు. తర్వత బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 81 పరుగులు మాత్రమే నమోదు చేసింది. జట్టులో నాగకోటిరెడ్డి 29, రాము 12 పరుగులు చేశారు. నిట్‌ బౌలర్లు అశ్వని 2, కల్యాణ్, కిరీటి చెరో వికెట్‌ పడగొట్టారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.