close

తాజా వార్తలు

Updated : 17/02/2020 21:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9PM

1. బయోఆసియా సదస్సుతో ప్రత్యేక గుర్తింపు:కేటీఆర్‌

భారత్‌ నుంచి ఉత్పత్తయ్యే ఫార్మా ఉత్పత్తుల్లో హైదరాబాద్‌ నుంచే 35 శాతం తయారవుతున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సాంకేతికత, లైఫ్‌సైన్సెస్‌ రంగాల్లో తెలంగాణ రాణిస్తోందని చెప్పారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో జరిగిన బయో ఆసియా సదస్సుకు కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బయో ఆసియా సదస్సు అంతర్జాతీయంగా హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘దమ్ముంటే ఐటీ శాఖపై పరువునష్టం దావా వేయండి’

తన మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో ఐటీ శాఖ జరిపిన సోదాలపై తెదేపా అధినేత చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వాలని వైకాపా డిమాండ్‌ చేసింది. రూ.2వేల కోట్ల అవినీతి జరిగిందని ఆదాయపన్ను శాఖ ప్రకటనలో తెలిపినా.. చంద్రబాబు మౌనంగా ఎందుకు ఉన్నారని వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. దమ్ముంటే సోదాలు జరిపిన ఐటీ శాఖపై పరువునష్టం దావా వేయాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘జీవోలు వెబ్‌సైట్‌లో ఎందుకు ఉంచడం లేదు’

ప్రభుత్వం జారీ చేసే జీవోలను వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. భారత సిలికాన్‌ వ్యాలీలాంటి హైదరాబాద్‌ మహానగరంలో వెబ్‌సైట్‌లో జీవోలు అప్‌లోడ్‌ చేసే సాఫ్ట్‌వేర్‌ లభించడం లేదా? అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉత్తర్వులను పబ్లిక్‌ డొమైన్‌లో పొందుపరిచేలా ఆదేశాలివ్వాలని కోరుతూ భాజపా నేత పేరాల శేఖర్‌రావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. దోషులకు డెత్‌ వారెంట్‌.. నిర్భయ తల్లి హర్షం 

 ‘నిర్భయ’ దోషులకు మార్చి 3న ఉరి తీసేందుకు పటియాలా హౌస్‌ కోర్టు డెత్‌ వారెంట్‌ జారీ చేయడం పట్ల నిర్భయ తల్లి హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే ఉరిశిక్ష అమలు చాలా ఆలస్యమైందనీ.. అయినా తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు సంతోషం కలిగించిందని చెప్పారు. న్యాయం కోసం తామెంతగానో పోరాటం చేశామని గుర్తు చేసుకున్నారు. తన కుమార్తెను కిరాతకంగా బలితీసుకున్న ఆ మృగాళ్లకు చివరకు డెత్‌ వారెంట్‌ జారీ చేయడం హర్షణీయమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సీఏఏపై తీర్మానం అందుకేనా..?: లక్ష్మణ్‌

పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ కేబినెట్ తీర్మానం చేయడం విడ్డూరంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మెజారిటీ పక్షాల మద్దతుతో పార్లమెంటులో తీసుకొచ్చిన ఓ చట్టాన్ని రాష్ట్రం ఏ విధంగా వ్యతిరేకిస్తుందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్‌కు రాజ్యాంగం తెలియదా? లేక ఒవైసీ మెప్పు కోసమా? అని నిలదీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ట్రయల్స్‌కు ఇప్పుడే రాను: శ్రీనివాస గౌడ

స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) నిర్వహించే ట్రయల్స్‌లో ఇప్పుడే పాల్గొననని, దానికి కొంత సమయం కావాలని సంప్రదాయ క్రీడ ‘కంబళ’ పోటీదారుడు శ్రీనివాస గౌడ తెలిపాడు. ‘‘సాయ్‌ నిర్వహించే ట్రయల్స్‌లో నేను పాల్గొనను. కంబళలో మరిన్ని ఘనతలు సాధించాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం కంబళ టోర్నమెంట్‌ సాగుతోంది. అందుకే ఒక నెల గడువు కావాలని సాయ్‌ను కోరాలని భావిస్తున్నా’’ అని శ్రీనివాస గౌడ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బలహీన వర్గాలను అణగదొక్కే కుట్ర..:భట్టి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు, బలహీన వర్గాల ప్రజలను అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. భాజపా ద్వారా జరుగుతున్న ఈ కుట్ర ప్రమాదకరమైందన్నారు. ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాలో భట్టి మాట్లాడారు. తాము కూడా భారతీయులమేనంటూ జాతీయ జెండా పట్టుకుని చెప్పాల్సిన పరిస్థితి దేశంలో నెలకొందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అపార్ట్‌మెంట్‌ అంతా ఖాళీ..మమ్మల్ని తీసుకెళ్లండి!

 చైనాలో కొవిడ్‌-19 ప్రభావిత వుహాన్‌ నగరంలో ఇద్దరు భారతీయ దంపతులు స్వదేశానికి వచ్చేందుకు పాట్లు పడుతున్నారు. యూపీకి చెందిన ఆ దంపతులు తమను స్వదేశానికి రప్పించండంటూ కేంద్రప్రభుత్వానికి సామాజిక మాధ్యమాల విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు చైనాలో ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను వీడియోలో వివరించారు. తాము ఉంటున్న అపార్ట్‌మెంట్‌ మొత్తం ఖాళీ అయిందని.. తమను భారత్‌కు తీసుకువెళ్లాలంటూ ప్రధానిని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘కొవిడ్‌’ను 40 ఏళ్ల ముందే ఊహించారా!?

 చైనాలో కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే, ఈ వైరస్‌ను 40 ఏళ్ల ముందే ఊహించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అమెరికాకు చెందిన రచయిత డీన్‌ కూంట్జ్‌ రచించిన ఐస్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌ నవలలో ఈ వైరస్‌ ప్రస్తావన ఉంది. అయితే, కరోనా అని కాకుండా వుహాన్‌-400 అని అందులో పేర్కొన్నారు. ఓ లేబోరేటరీలో తయారైన ఓ జీవరసాయన ఆయుధంగా రచయిత తన కాల్పనిక (ఫిక్షన్‌) నవల్లో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. యువతి ప్రాణాల మీదకు తెచ్చిన అజాగ్రత్త

 ఓ యువతి అజాగ్రత్తగా రోడ్డు దాటుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌ నగర్‌లో సోమవారం చోటు చేసుకుంది. అలేఖ్య అనే యువతి రోడ్డు దాటుతూ ద్విచక్రవాహన దారుడిని ఢీ కొట్టింది. అదే సమయంలో వెనక వస్తున్న కారు డ్రైవర్‌ గమనించకుండా ముందుకు వెళ్లాడు. ఈ ప్రమాదంలో యువతిపైకి కారు ముందు టైరు దూసుకెళ్లింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.