రియల్‌మీ స్మార్ట్‌వాచీలు
close

తాజా వార్తలు

Updated : 24/12/2020 07:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రియల్‌మీ స్మార్ట్‌వాచీలు

దిల్లీ: శరీరంపై ధరించే పరికరాలు సహా కృత్రిమ మేధ ఆధారిత ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఏఐఓటీ) ఉత్పత్తుల తయారీ చేపట్టేందుకు వీలుగా సామర్థ్యాలను విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ ప్రకటించింది.  గ్రేటర్‌ నోయిడా ప్లాంట్‌లో రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లు, టీవీలను ఉత్పత్తి చేస్తోంది. బుధవారం మూడు వాటర్‌ ఫ్రూఫ్‌ స్మార్ట్‌వాచీలు- వాచ్‌ ఎస్‌, వాచ్‌ ఎస్‌ మాస్టర్‌ ఎడిషన్‌, వాచ్‌ ఎస్‌ ప్రో సిరీస్‌ను రియల్‌మీ విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ.4999, రూ.5999, రూ.9999గా నిర్ణయించారు. రియల్‌టైమ్‌ హార్ట్‌ రేట్‌ మానిటర్‌, బ్లడ్‌ ఆక్సిజన్‌ సాచ్యురేషన్‌ లెవల్‌ మానిటర్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు కంపెనీ వెబ్‌సైట్‌లో ఈ నెల 28 నుంచి ఈ వాచీలు లభిస్తాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని