మృతదేహం కాల్చివేతతో కలకలం
close

తాజా వార్తలు

Updated : 24/04/2020 07:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మృతదేహం కాల్చివేతతో కలకలం

 హైదరాబాద్‌ రింగురోడ్‌  సమీపంలో ఘటన

హయత్‌నగర్‌: హైదరాబాద్‌ రింగురోడ్డు సమీపంలోని కోహెడ రెవెన్యూ పరిధిలో ఓ మృతదేహాన్ని కాల్చివేయడం స్థానికంగా కలకలం రేపింది. బుధవారం రాత్రి సమీపంలోని గుట్టల మధ్య నుంచి రెండు అంబులెన్సులు రావడాన్ని గమనించిన స్థానికులు వాహనాలను అడ్డుకుని అందులో ఉన్న వారిని ప్రశ్నించారు. మృతదేహాన్ని కాల్చినట్లు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వారి నుంచి వివరాలను సేకరించారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో మృతదేహాన్ని కాల్చివేసినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న తుర్కయాంజాల్‌ పురపాలిక ఛైర్‌పర్సన్‌ మల్‌రెడ్డి అనురాధ, స్థానిక నాయకులు గురువారం ఉదయం అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఎక్కడి నుంచో తెచ్చిన మృతదేహాలను ఇక్కడ కాల్చివేయడం ఏమిటని, అవి ఎక్కడివని, కరోనా సోకి మరణించిన వారివైతే ఇక్కడి ప్రజల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని