close

తాజా వార్తలు

Published : 18/03/2020 18:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా ఎఫెక్ట్‌: పరీక్షలు లేకుండానే..

లఖ్‌నవూ (యూపీ): కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు పరీక్షలు రద్దు చేసింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. తాజాగా ఆ సెలవులను మరింత పొడిగించింది. ఈ నేపథ్యంలో 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు నిర్వహించాల్సిన వార్షిక పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయా తరగతుల విద్యార్థులకు పరీక్షలు లేకుండానే తర్వాతి తరగతికి ఉన్నతి కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో మార్చి 23 నుంచి 28 మధ్యకాలంలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు విద్యాశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి రేణుకా కుమార్ ప్రకటించారు. కాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పటి వరకూ 16 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని