close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 25/05/2020 06:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సామాజిక మాధ్యమంలో పోస్టులు.. కేసుల నమోదు

రాజమహేంద్రవరం, ఏలూరు, నెల్లూరు, తాడేపల్లి- న్యూస్‌టుడే: సామాజిక మాధ్యమంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు చేశారని, జగన్‌ కుటుంబీకులపై అభ్యంతరకర అంశాలతో కూడిన కార్యక్రమం రూపొందించారనే ఆరోపణలపై రాష్ట్రంలో వేర్వేరు చోట్ల కేసులు నమోదయ్యాయి. రాజమహేంద్రవరం బొమ్మూరు పోలీసులు ఐటీ చట్టం కింద ముగ్గురిపై కేసులు నమోదు చేసి నోటీసులిచ్చారు. సీఐ లక్ష్మణరెడ్డి వివరాల ప్రకారం.. గత నెలలో రాజమహేంద్రవరంలో ఉపముఖ్యమంత్రి సుభాష్‌చంద్రబోస్‌, ఎంపీ భరత్‌రామ్‌ కలసి పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. దీనిపై పలు వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు వచ్చాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ వ్యక్తిగత సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి విచారణలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఉండవల్లి అనూష, తూర్పుగోదావరి జిల్లా మల్కిపురం మండలం మోరి ప్రాంతానికి చెందిన విశ్వేశ్వరప్రసాద్‌, రాజమహేంద్రవరానికి చెందిన నరేంద్రకుమార్‌ పోస్టులు పెట్టారని తేలింది. వారు 3 రోజుల్లో తమ స్టేషన్‌లో హాజరుకావాలని సీఐ సూచించారు.

‘మాస్‌ మల్లన్న’పై కేసు
సీఎం జగన్‌,  ఆయన కుటుంబసభ్యులపై అభ్యంతరకర అంశాలతో కూడిన కార్యక్రమం రూపొందించారంటూ నల్గొండ జిల్లా మాదాపూర్‌కు చెందిన చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌ మాస్‌ మల్లన్నపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. ప్రసార మాధ్యమంలో ప్రసారమైన ఆధారాలను చూపుతూ వైకాపా లీగల్‌సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది జనార్దన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.