ఏపీలో ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నం: కనకమేడల
close

తాజా వార్తలు

Updated : 04/02/2021 14:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నం: కనకమేడల

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కోసం ఇచ్చే నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లిస్తోందని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు. గురువారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఏపీ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైంది. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందంటే.. కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 20 నెలల్లోనే  లక్షా 46 కోట్లు అప్పు చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకందా ఎవరు మాట్లాడినా... తప్పుడు కేసులతో వేధిస్తోంది’’ అని వివరించారు.

పోలవరం పూర్తి చేయండి 
కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ విజ్ఞప్తి చేశారు. ‘‘ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలోనే 69 నుంచి 70శాతం వరకు పనులు పూర్తయ్యాయి. కానీ, ప్రస్తుత ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ పేరిట పోలవరం పనులను నిలిపివేసింది. దీని వల్ల ఏడాది కాలం వృథా అవ్వడమే గాక.. రైతులు ఒక పంటను కోల్పోయారు. కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకుని నిధులివ్వడంతో పాటు, కాలపరిమితిలోగా  పూర్తి చేయాలని ఏపీ ప్రజలు, రైతులు కోరుతున్నారు’’ అని కనకమేడల సభ దృష్టికి తెచ్చారు.

ఇవీ చదవండి...
ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం స్పందన

ఏకగ్రీవాలు శ్రుతిమించితే అధికారుల వైఫల్యమే


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని