‘లైగర్‌’ వచ్చేస్తున్నాడు..! 
close

తాజా వార్తలు

Updated : 11/02/2021 16:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘లైగర్‌’ వచ్చేస్తున్నాడు..! 

హైదరాబాద్‌: టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘లైగర్‌’. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబర్‌ 9న ‘లైగర్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్‌ ఇండియా‌ చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. సినిమా విడుదల తేదీని తెలియజేస్తూ విజయ్‌ దేవరకొండ ట్విటర్‌ వేదికగా ‘లైగర్‌’ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ‘తేదీ ఫిక్స్‌ చేసుకున్నాం. భారత్‌.. మేము వచ్చేస్తున్నాం.’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘లైగర్‌’ కోసం బాక్సింగ్‌లో విజయ్‌ శిక్షణ తీసుకున్నారు. ఇందులో విజయ్‌దేవరకొండ పొడవాటి జుట్టుతో మాస్‌ లుక్‌లో విభిన్నంగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘లైగర్‌’ ఫస్ట్‌లుక్‌ సినీ ప్రియులను ఎంతగానో ఆకర్షించింది. ఈ సినిమాలో విజయ్‌ సరసన అనన్యాపాండే సందడి చేయనున్నారు. ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఇదీ చదవండి

హాలీవుడ్‌ సినిమాల నుంచి ‘పుష్ప’ ఫైట్స్‌


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని