అర్ధాంగిని మరువలేక.. అర్ధాంతరంగా..
close

తాజా వార్తలు

Updated : 31/03/2021 12:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అర్ధాంగిని మరువలేక.. అర్ధాంతరంగా..

అనకాపల్లి పట్టణం: భార్య మృతి చెందిందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అనకాపల్లి సమీపంలోని ముత్రాసు కాలనీలో నివాసం ఉండే కొక్కిర సత్యనారాయణ(42).. దగ్గర్లోని ఫార్మాసిటీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. గత ఏడాది నవంబరులో ఇతని భార్య పుష్పలత(38) అనారోగ్యంతో మృతిచెందారు. ఈ దంపతులకు ఐదో తరగతి చదువుతున్న లోకేశ్‌, మూడో తరగతి చదువుతున్న తేజశ్రీ ఉన్నారు. 

భార్య మృతిచెందినప్పటి నుంచి సత్యనారాయణ తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తొలుత తన పిల్లలకు విషమిచ్చి.. ఆపై తాను ఊరేసుకొని బలవన్మరణం చేసుకున్నాడు. బుధవారం ఉదయం మృతుడి అత్త నూకరత్నం సత్యనారాయణ ఇంటి తలుపు తెరిచి చూడగా ముగ్గురూ విగత జీవులుగా కనిపించారు. దీంతో ఆమె హతాశురాలైంది. ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. ముగ్గురి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని