పార్టీ సభ్యుడికి అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ పోతుందా?

తాజా వార్తలు

Published : 27/06/2020 00:51 IST

పార్టీ సభ్యుడికి అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ పోతుందా?

ఎన్నికల సంఘం అధికారులకు ఎంపీ ప్రశ్న

దిల్లీ: ఎన్నికల సంఘం అధికారులతో నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజు భేటీ ముగిసింది. సుమారు గంటన్నరపాటు అధికారులతో ఆయన మాట్లాడారు. వైకాపా క్రమశిక్షణ కమిటీ, దాని సభ్యులు ఎవరో నియమ నిబంధనల్లో చెప్పారా? ఉంటే వాటి వివరాలు ఇవ్వాలని ఎన్నికల సంఘం సెక్రెటరీ జనరల్, డైరెక్టర్ జనరల్‌ను ఎంపీ కోరారు. పార్టీ సభ్యుడికి అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ పోతుందా... అలాంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ తరహా కేసు తొలిసారి చూస్తున్నట్లు ఎంపీతో ఎన్నికల సంఘం అధికారులు అన్నట్లు తెలుస్తోంది. ఎంపీ కోరిన సమాచారం సోమవారం లేదా మంగళవారం నాడు ఇస్తామని ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు. దీంతో రఘు రామకృష్ణ రాజు సోమవారం మరోసారి ఎన్నికల సంఘం అధికారులను కలవనున్నారని సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని