రెండో దశ పోలింగ్‌: బెంగాల్‌లో ఉద్రిక్తతలు
close

తాజా వార్తలు

Updated : 01/04/2021 15:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండో దశ పోలింగ్‌: బెంగాల్‌లో ఉద్రిక్తతలు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్‌ గురువారం ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. కీలకమైన నందిగ్రామ్‌ సహా రాష్ట్రంలోని 30 నియోజకవర్గాలకు నేడు ఓటింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, పలు చోట్ల టీఎంసీ, భాజపా కార్యకర్తల వాగ్వాదంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. 

పోలింగ్ ఏజెంట్‌పై దాడి..

కేశాపూర్‌లో భాజపా పోలింగ్‌ ఏజెంట్‌పై తృణమూల్‌ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పోలింగ్‌ ఏజెంట్‌ను ఆసుపత్రికి తరలించారు. ఇదే ప్రాంతంలో భాజపా నేత తన్మయ్‌ ఘోష్‌ కారుపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇక దేబ్రా నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ బూత్‌ వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. భద్రతాబలగాలు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ముందు జాగ్రత్త చర్యగా దేబ్రా భాజపా మండల అధ్యక్షుడు మోహన్‌ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు దేబ్రాలో భాజపా అభ్యర్థి ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని తృణమూల్‌ ఆరోపించింది. 

తృణమూల్‌ కార్యకర్త హత్య..

పోలింగ్‌ ప్రారంభమవడానికి కొద్ది గంటల ముందు కేశాపూర్‌లో ఓ తృణమూల్‌ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. హరిహర్‌చక్‌ ప్రాంతానికి చెందిన ఉత్తమ్‌ దొలయ్‌ని నిన్న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పొడిచి చంపారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భాజపా కార్యకర్తలే ఉత్తమ్‌ను హత్య చేశారని టీఎంసీ ఆరోపిస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. 

పోలింగ్‌ శాతం ఇలా..

మరోవైపు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. ఉదయం నుంచి పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. తొలి రెండు గంటల్లో పశ్చిమ బెంగాల్‌లో 16శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. బెంగాల్‌తో పాటు అసోంలోని 39 నియోజకవర్గాలకు కూడా నేడు పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు అక్కడ 10.51శాతం ఓటింగ్‌ నమోదైంది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని