
తాజా వార్తలు
గ్రామాలకు వైకాపా గ్రహణం పట్టింది: తెదేపా
అమరావతి: గ్రామాలకు వైకాపా గ్రహణం పట్టిందని తెదేపా శాసనసభాపక్షం విమర్శించింది. పెండింగ్‌లో ఉన్న రూ.2,500కోట్ల ఉపాధి హామీ పథకం బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి పాదయాత్రగా నిరసన ర్యాలీ చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ప్రభుత్వం రూ.70వేల కోట్లు బకాయి పడిందని నేతలు మండిపడ్డారు. జేట్యాక్స్ కడితేనే బిల్లులు చెల్లింపు చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కినా ప్రజాక్షేత్రంలో పోరాడతామని నేతలు స్పష్టం చేశారు.
నరేగా పనులు చేసిన అత్యధికులు ఎస్సీ, ఎస్టీలేనని.. ఇప్పుడు వారంతా అప్పులపాలై ఆత్మహత్య చేసుకునే దుస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కక్షసాధింపుతోనే జగన్.. మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులకు నరేగా బిల్లులు చెల్లించలేదని మండిపడ్డారు. ఏడాది క్రితమే కేంద్రం రూ.1,860కోట్లు మంజూరు చేసినా వాటిని సొంత పథకాలకు మళ్లించుకున్నారని నేతలు ఆరోపించారు. నరేగా నిధుల్ని సద్వినియోగం చేసుకుని తెదేపా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని.. ఒక్క రోడ్డు కూడా వేయలేదని తెదేపా నేతలు మండిపడ్డారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- భద్రతా సిబ్బంది నుంచే ముప్పు!
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
