‘ఆ రాష్ట్రాలతో సరిహద్దుల వల్లే కరోనా వ్యాప్తి’
close

తాజా వార్తలు

Published : 27/07/2020 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆ రాష్ట్రాలతో సరిహద్దుల వల్లే కరోనా వ్యాప్తి’

తెలంగాణ మంత్రి ఈటల

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ మంత్రులు ఈటల రాజేందర్‌, ప్రశాంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. కరోనా చికిత్స, వసతులపై వైద్యాధికారులతో మాట్లాడారు. అనంతరం మంత్రి ఈటల మీడియాతో మాట్లాడుతూ ‘‘మహారాష్ట్ర, కర్ణాటకతో సరిహద్దులు వల్ల నిజామాబాద్‌ జిల్లాలో కరోనా వ్యాప్తి చెందుతోంది. వలస వచ్చినవారి నుంచి కరోనా వ్యాప్తిని అరికట్టడంలో జిల్లా అధికారుల పని తీరు బాగుంది. నిజామాబాద్‌ ఆస్పత్రిలో కొవిడ్‌ చికిత్సకు సౌకర్యాలు కల్పించాం. కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలి. తెలంగాణలో మాత్రమే కరోనా ఉందన్నట్లుగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వారి చర్యలు ఉన్నాయి. ప్రతిపక్షాలు విలువైన సూచనలు ఇస్తే స్వీకరిస్తాం’’అని మంత్రి ఈటల చెప్పారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని