AP News: పడిపోతున్న కోడి ధర

తాజా వార్తలు

Updated : 14/10/2021 08:22 IST

AP News: పడిపోతున్న కోడి ధర

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: దసరా పండగ నేపథ్యంలో కోడిమాంసం వినియోగం తగ్గింది. బ్రాయిలర్‌ కోళ్లకు డిమాండ్‌ అమాంతం పడిపోయింది. పండగ ముందు వరకు రైతు ధర కిలో రూ.135 ఉండగా ప్రస్తుతం రూ.112 పలుకుతోంది. కరోనా నేపథ్యంలో ఏడాదిగా బ్రాయిలర్‌ మాంసానికి గిరాకీ ఏర్పడింది. అయితే ప్రస్తుతం కోళ్లు అందుబాటులో ఉన్నా రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది. చిల్లర ధర కిలో చికెన్‌ ధర రూ.180 పలుకుతోంది. ఉండ్రాజవరం, తణుకు, పెరవలి, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, పెనుగొండ, అత్తిలి తదితర ప్రాంతాల్లో బ్రాయిలర్‌ కోళ్ల పెంపకాన్ని ఎక్కువగా చేపట్టారు. జిల్లాలో నెలకు సుమారు 1.2 లక్షలకు పైగా ఈ కోళ్లను ఉత్పత్తి చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని