ఆ సమయంలో చనిపోయానేమో అనుకున్నా!
close

తాజా వార్తలు

Published : 25/02/2021 02:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ సమయంలో చనిపోయానేమో అనుకున్నా!

ఇంటర్నెట్‌ డెస్క్:  జేమ్స్ కామెరూన్ దర్శక-నిర్మాణంలో తెరకెక్కతున్న ప్రతిష్ఠాత్మక భారీ బడ్జెట్‌ చిత్రం ‘అవతార్ 2’. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను నీటిలోనే చిత్రీకరించారు. ఇందులో ‘టైటానిక్‌‌’ కథానాయిక కాటె విన్‌స్లెట్‌ ‘రోనల్‌’ అనే పాత్రలో నటిస్తోంది. కథలో ఆమెది చాలా కీలకమైన పాత్ర. ఈ సినిమా కోసం ఆమె డైవింగ్‌ నేర్చుకుందట. కాటెపై  ఏడు నిమిషాల పాటు అండర్‌ వాటర్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఆమె భర్త నెడ్‌ రాక్‌ర్నోల్‌ చాలా సహాయపడ్డారట. తాజాగా ఆమె ‘అవతార్‌2’ చిత్రంలోని అండర్‌ వాటర్‌లోని కొన్ని సన్నివేశాల చిత్రీకరణ గురించి ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ...‘‘నీటి అడుగు భాగాన చిత్రీకరణ జరుపుతున్న సమయంలో నా ఊపిరి ఆగిపోయినంత పని అయిపోయింది. ఓ దశలో నేను చనిపోయానేమో అనుకున్నా. నీటిలో ఉండి ఊపిరి బిగబట్టే విషయంలో మా ఆయన నెడ్‌ నాకెంతో సహాయపడ్డారు’’ అంటూ తెలిపింది.  లైట్‌స్ట్ర్రోమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రంలో సామ్ వర్తింగ్‌టన్,  జో సల్దానా,  స్టీఫెన్ లాంగ్,  జియోవన్నీ రిబిసి తదితరులు నటిస్తున్నారు. డిసెంబర్ 16, 2022న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇవీ చదవండి:


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని