close

తాజా వార్తలు

Published : 16/01/2021 13:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. కన్నీటి పర్యంతమైన మోదీ

‘కరోనా మహమ్మారి ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఎంతో మంది తల్లుల కడుపుకోతకు కారణమైంది’ అని టీకా పంపిణీ ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ ప్రక్రియను మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కరోనా పోరులో గతేడాది ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అతిపెద్ద వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం

2. తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం

కొవిడ్‌ మహమ్మారిపై పోరులో నెలలుగా ఎదురు చూస్తున్న ముహూర్తం రానే వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో శనివారం ఉదయం కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో తొలి రోజు 140 కేంద్రాల్లో పంపిణీ చేపట్టారు. రాష్ట్రంలో ఇప్పటికే 3.64 లక్షల కొవిషీల్డ్‌ టీకా డోసులు, 20 వేల కొవాగ్జిన్‌ టీకా డోసులు అందుబాటులోకి వచ్చాయి. సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి  కిషన్‌రెడ్డి, తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భారత్..ఏడాదిలోపే అందుబాటులోకి టీకా..!

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ మహమ్మారి భారత్‌లో వెలుగుచూసి దాదాపు సంవత్సరం కావస్తోంది. ఈలోపే దేశంలో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం ఉపశమనం కలిగిస్తోంది. శాస్త్రవేత్తల కృషి ఫలితంగానే సాధ్యమైనంత తొందరగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిందని దేశవ్యాప్త టీకా పంపిణీ ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అంతేకాదు, మరే వ్యాధికి ఇంత తక్కువ సమయంలో టీకా అందుబాటులోకి రాలేదని నిపుణులు గుర్తుచేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

టీకా తీసుకున్న ఎయిమ్స్‌ డైరెక్టర్‌!

4. ‘పేషెంట్‌ జీరో’ను ఎప్పటికీ కనుక్కోలేము..!

ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ మహమ్మారి మూలాల శోధన ప్రారంభమైంది. ఇందుకోసం ప్రపంచ ఆరోగ్యసంస్థ నేతృత్వంలోని నిపుణుల బృందం వుహాన్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే, కరోనా వైరస్‌ సోకిన తొలి వ్యక్తి ‘పేషెంట్‌ జీరో’ను కనుక్కోవడం అసాధ్యమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. పేషెంట్‌ జీరోను ప్రపంచం ఎన్నటికీ కనుక్కోకపోవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ వ్యాధుల విభాగం సాంకేతికాధిపతి మారయా వ్యాన్‌ కోర్కోవ్‌ అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అందుకే చైనాపై మా అనుమానాలు: పాంపియో

5. 20లక్షలు దాటిన కరోనా మరణాలు!

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 20లక్షలు దాటింది. జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం శుక్రవారానికే మరణాలు 20 లక్షలు దాటిపోయాయి. వుహాన్‌లో తొలిమరణం నమోదైన సరిగ్గా ఏడాది తర్వాత ఈ సంఖ్య నమోదు కావడం గమనార్హం. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 20 లక్షలు కేవలం అధికారికంగా నమోదు చేసిన మరణాలేనని.. లెక్కలోని రానివి ఇంకా చాలా ఉంటాయని భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భారత్‌: 96.56 శాతానికి పెరిగిన రికవరీ..

 దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,158 వైరస్‌ కేసులు బయటపడ్డాయి. క్రితం రోజుతో పోలిస్తే 432 కేసులు తక్కువ. శనివారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,05,42,841కి చేరింది. ఇక గత 24 గంటల్లో మరో 16,977 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు వైరస్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,01,79,715కి పెరిగింది. రికవరీ రేటు 96.56శాతంగా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణలో కొత్తగా 249 కరోనా కేసులు

7. సీఎం కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖ

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎంఎంటీఎస్‌ విస్తరణ పనులకు నిధులు విడుదల చేయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఈమేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖ రాశారు. ఎంఎంటీఎస్‌ విస్తరణ పనుల కోసం కేంద్రం ఇప్పటి వరకు రూ.789 కోట్లు ఖర్చు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన రూ.414 కోట్లు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయని కిషన్‌రెడ్డి వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. తూటాల జడివాన మధ్య మానవత్వం

జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమానికి సంబంధించి భారత సైన్యం తన ప్రామాణిక నిర్వహణ విధానా (ఎస్‌వోపీ)ల్లో మార్పు చేపట్టింది. ఉగ్రవాదులతో భీకర పోరాటం జరిగే సమయంలోనూ.. ఆ ముష్కరుల్లో పరివర్తనకు ప్రయత్నించాలని నిర్ణయించింది. వారికి నచ్చజెప్పి, లొంగిపోయేలా చూసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని తీర్మానించుకుంది. ఈ విధానంలో సైనికుల ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ.. దారితప్పిన యువతను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సహకార బ్యాంకులపై ఆర్‌బీ‘ఐ’ 

సహకార బ్యాంకుల పనితీరును ప్రక్షాళన చేసేందుకు రిజర్వుబ్యాంకు(ఆర్‌బీఐ) కసరత్తు చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరంభం(ఏప్రిల్‌ 1) నుంచి కొత్త ఆదేశాలను అమల్లోకి తేనున్నట్లు సమాచారం. ఇప్పటికే గత సెప్టెంబరు ఒకటి నుంచి పట్టణాలు, నగరాల్లోని అర్బన్‌ సహకార బ్యాంకుల నియంత్రణ బాధ్యతను ఆర్‌బీఐ తీసుకుంది. రైతులకు, వ్యవసాయానికి సేవలందించే గ్రామీణ సహకార బ్యాంకులను సంస్కరించాలని నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. గబ్బా టెస్టు: రెండో రోజు ఆట రెండు సెషన్లే

బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుతున్న నాలుగో టెస్టు శనివారం రెండు సెషన్లే జరిగింది. టీ విరామం అనంతరం వర్షం కురవడంతో ఆట తిరిగి ప్రారంభంకాలేదు. అప్పటికి భారత్‌ స్కోర్‌ 26 ఓవర్లలో 62/2గా నమోదైంది. శుభ్‌మన్‌(7), రోహిత్‌(44) ఔటవ్వగా, పుజారా (8*), రహానె(2*) క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా కన్నా భారత్‌ ఇంకా 307 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌటైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పాండ్య సోదరులకు పితృ వియోగం..Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని