
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 9 PM
1. ఆంక్షలు మీరినా కోడ్ ఉల్లంఘనే: నిమ్మగడ్డ
మున్సిపల్ ఎన్నికల సమయంలో వార్డు వాలంటీర్లు తమ పరిధి దాటి వ్యవహరించకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం ఆంక్షలను అతిక్రమిస్తే కోడ్ ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్ఈసీ మాట్లాడారు. కోడ్ ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకూ అవకాశముంటుందని హెచ్చరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* వార్డు వాలంటీర్ల సేవలపై ఎస్ఈసీ ఆంక్షలు
2. తెరాస పతనం మొదలైంది: ఉత్తమ్
రాష్ట్రంలో ఏమాత్రం బలం లేని భాజపా నీటి బుడగలాంటిదని.. మరోవైపు తెరాస పతనం మొదలైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో టీపీసీసీ అనుబంధ సంఘాలతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. ప్రతి గ్రామం, ప్రతి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్నారు. కొంతమంది స్వార్థపరులు మాత్రమే పార్టీని వీడుతున్నారని.. ఇది ముమ్మాటికీ దుర్మార్గమైన చర్యగా అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. మోదీ గర్వించదగిన వ్యక్తి: గులాం నబీ ఆజాద్
కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై అసమ్మతి వ్యక్తంచేస్తోన్న సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. ప్రధాని హోదాలో ఉన్నప్పటికీ.. గ్రామీణ నేపథ్యాన్ని, చాయ్‌వాలా అని తన మూలాల గురించి నరేంద్ర మోదీ చెప్పుకోవడం గొప్ప విషయమన్నారు. జమ్మూ కశ్మీర్లో గుజ్జర్లు ఏర్పాటుచేసిన ఓ బహిరంగ సమావేశంలో పాల్గొన్న ఆజాద్, నిజాన్ని దాచని వ్యక్తిత్వం మోదీ సొంతమని అభినందించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. పేపర్ లీక్.. ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్ష రద్దు
ఆర్మీ రిక్రూట్మెంట్కు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకవ్వడంతో దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన నియామక పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఆర్మీ ప్రకటించింది. ఈ వ్యవహారంలో ముగ్గురు వ్యక్తులను పుణెలో అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. రిక్రూట్మెంట్ విషయంలో ఎలాంటి అక్రమాలకూ తావు ఉండకూడదనే ఉద్దేశంతో పరీక్ష రద్దు చేసినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ‘వై’ పోస్టర్ విడుదల!
ఇటీవల కాలంలో చిన్న చిత్రాల హవా బాగా నడుస్తోంది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్స్‌తో పాటు హారర్ జోనర్‌ను నేపథ్యంగా ఎంచుకుని చిత్రాలను ఆసక్తికరంగా నిర్మిస్తున్నారు. ఆ కోవలోనే ఇప్పుడు ‘వై’అనే పేరుతో మరో కొత్త చిత్రం రాబోతుంది. రాహుల్ రామకృష్ణ, శ్రీరామ్, అక్షయ చందర్‌లు ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళంలో ఏకకాలంలో నిర్మితమవుతోంది. బాలు అడుసుమిల్లి రచించి దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులు..?
దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరల రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వల్ల ధరలు నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందనే వాదన ఉంది. తాజాగా దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదనకు తాను మద్ధతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఒకే వేదిక.. ఒకే ముహూర్తం.. 3,229 పెళ్లిళ్లు
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్ రంగులమయమైంది. ఓ అరుదైన వేడుకను తిలకించేందుకు పలు జిల్లాల నుంచి వారి బంధుగణం నగరానికి పోటెత్తింది. అక్కడ మోగిన బాజా భజంత్రీలు నగర వ్యాప్తంగా మారుమోగాయి. రాయ్‌పుర్‌లోని ఇండోర్ స్టేడియంలో ఒకేసారి 3,229 జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. కుల, మత భేదాలు లేకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ మతాల జంటలు ఒకేసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టాయి. ఈ అరుదైన వేడుక మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* మద్యం లేకుండా పెళ్లి జరిగితే నగదు బహుమతి!
8. తగ్గని కొవిడ్ ఉద్ధృతి..పుణెలో కర్ఫ్యూ పొడగింపు!
మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్డౌన్, కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తున్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పుణెలో రాత్రి కర్ఫ్యూని మరో రెండు వారాలు పొడగిస్తున్నట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. అప్పటివరకు పాఠశాలలు, కాలేజీలు కూడా మూసే ఉంటాయని పుణె మేయర్ ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. మహిళ మృతి కేసు.. ‘మహా’ మంత్రి రాజీనామా
మహరాష్ట్ర అటవీ శాఖ మంత్రి, శివసేన ఎమ్మెల్యే సంజయ్ రాథోడ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సీఎం ఉద్ధవ్‌తో భేటీ అనంతరం రాజీనామా నిర్ణయాన్ని ఆదివారం ప్రకటించారు. ఈ నెల 8న అనుమానాస్పద స్థితిలో మరణించిన టిక్‌టాక్ స్టార్ పూజా చవాన్ (22) కేసులో సంజయ్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆమెతో మంత్రి ఉన్న ఫొటోలు, ఆడియో, వీడియో క్లిప్పింగులు బయటకు రావడంతో విపక్షాలు ఆయన రాజీనామాకు పట్టుబట్టాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* హంగ్ ఏర్పడితే భాజపాతో మమత దోస్తీ: ఏచూరి
10. అశ్విన్.. ఇంగ్లాండ్‌ను ఎక్కడా వదలట్లేదు
టీమ్ఇండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్ వాళ్లను ఎక్కడా వదలట్లేదని.. అటు మైదానంలో, ఇటు మీడియా సమావేశంలో నోరు మెదపనీయడం లేదని మాజీ బ్యాట్స్‌మన్ వసీమ్ జాఫర్ సరదాగా చురకలంటించాడు. మొతేరా వేదికగా జరిగిన మూడో (డే/నైట్) టెస్టులో భారత్ 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీసేన సిరీస్‌లో 2-1తేడాతో ఆధిక్యం సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి