close
విభజనను కేంద్రం ఆమోదించలేదు

అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ వెల్లడి
తమ 31 శాతం వాటా ఏపీఎస్‌ఆర్టీసీలోనే ఉందని స్పష్టం చేసిన కేంద్రం
టీఎస్‌ ఆర్టీసీ చట్టబద్ధతను ప్రశ్నించిన హైకోర్టు

టీఎస్‌ఆర్టీసీ ఆవిర్భావానికి తమ అనుమతి లేదని, దాని ఉనికికి గుర్తింపులేదని కేంద్రం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ రాజేశ్వరరావు హైకోర్టుకు తెలిపారు. కేంద్రానికి సమాచారమిచ్చి అనుమతి తీసుకున్నాకే విభజన జరుగుతుందని, తమ 31 శాతం వాటా ఏపీఎస్‌ఆర్టీసీలోనే ఉందన్నారు. విభజనను కేంద్రం ఆమోదించలేదన్నారు.  దీనిపైౖ ఏజీ బి.ఎస్‌.ప్రసాద్‌ సమాధానమిస్తూ రవాణా చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం ఆర్టీసీ ఏర్పాటైందన్నారు. సెక్షన్‌ 47ఎతో సంబంధంలేదన్నారు. దీంతో ధర్మాసనం విభేదిస్తూ సెక్షన్‌ 47ఎ ప్రకారం పునర్‌వ్యవస్థీకరణ జరిగి టీఎస్‌ఆర్టీసీగా కేంద్రం ఆమోదించినపుడే ఉనికి ఉంటుందని పేర్కొంది. కేంద్రం ఆమోదం లేనపుడు ఆర్టీసీ ఉనికికి చట్టబద్ధతేముందని ప్రశ్నించింది.సెక్షన్‌ 3 కింద కొత్తగా ఏర్పాటు చేసుకుంటున్నామంటే ఆస్తి, అప్పులు తేలలేదని ఎందుకంటారని ప్రశ్నించింది. మీ పుట్టుకే కొత్తగా ఉన్నపుడు వాటితో సంబంధమేమిటంది? పునర్‌వ్యవస్థీకరణ జరిగితేనే అవన్నీ ఉంటాయంది. ఆర్టీసీకి ప్రత్యేకంగా చట్టం ఉన్నపుడు, మిగిలిన చట్టాలకు అతీతంగా ఉంటుందని తెలిపింది. ఆర్టీసీ చట్టం ప్రకారం కేంద్రం నుంచి ఆమోదం తీసుకోవాలని, వేరే చట్టాల పేరు చెప్పి ఆమోదం పొందకుండా చూడలేరంది. టీఎస్‌ఆర్టీసీ కొత్తగా వచ్చినపుడు ఏపీఎస్‌ఆర్టీసీనే మొత్తం బస్సులు తీసుకెళ్లాలని చెప్పారా అని ప్రశ్నించింది. మీ ప్రకటనలకే పొంతన కుదరడంలేదంది. జోషి జోక్యం చేసుకుంటూ ఏపీఎస్‌ఆర్టీసీ బోర్డు ఉందని, అందులో కేంద్ర సభ్యులు కూడా ఉన్నారని, పునర్‌వ్యవస్థీకరణకు వారు అంగీకరించారనగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ బోర్డు నిర్ణయం కాదని, కేంద్ర ఆమోదమూ ఉండాలంది. వాస్తవానికి రెండు రాష్ట్రాలు లేఖలు రాయాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి జోక్యం చేసుకుంటూ సామాన్యులు ఇబ్బందిపడరాదన్న ఉద్దేశంతో సెక్షన్‌ 3 కింద ఆర్టీసీని నడుపుతున్నామనగా ధర్మాసనం స్పందిస్తూ మీకు చట్టం తెలియదంటే అంగీకరించలేమంది. న్యాయశాఖ ఏం చేస్తోందంది. 2016 ఏప్రిల్‌ 27న టీఎస్‌ఆర్టీసీని ఓ నోటిఫికేషన్‌ ద్వారా ఏర్పాటు చేశామని ఆర్థిక శాఖ కార్యదర్శి చెప్పగా 2014 నుంచి 2016 వరకు తెలంగాణలో బస్సులను ఎవరు నడిపారని ధర్మాసనం ప్రశ్నించింది. ఏపీకి, తెలంగాణకు మధ్య ఏదైనా ఒప్పందం ఉందా అంది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.