జామ్‌తో అందిన ప్రగతి

ప్రధానాంశాలు

జామ్‌తో అందిన ప్రగతి

మంత్రి నిర్మల

ఔరంగాబాద్‌: మూడు సౌకర్యాల సమాహారమైన ‘జామ్‌’ ద్వారా మారుమూలలో ఉన్న ప్రజలకు కూడా ప్రగతి ఫలాలు అందాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. జన్‌ధన్‌ యోజన-ఆధార్‌- మొబైల్‌ (జేఏఎం-జామ్‌) ద్వారా కరోనా సమయంలో ఎన్నో విధాలుగా సేవలు అందించామని చెప్పారు. గురువారం ఇక్కడ రాష్ట్రీయ బ్యాంక్‌ పరిషత్‌ నిర్వహించిన ‘మంథన్‌’ సదస్సును ఆమె వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ విధానం ద్వారా ప్రజలకు నేరుగా ఆర్థిక లబ్ధి కలిగించామని తెలిపారు. ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాద్‌ మాట్లాడుతూ 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాను ప్రారంభించేలా విధానాన్ని రూపొందిస్తామని చెప్పారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని