Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009822
            [news_title_telugu_html] => విజయశాంతి గురించి మహేశ్‌ ట్వీట్‌
            [news_title_telugu] => విజయశాంతి గురించి మహేశ్‌ ట్వీట్‌
            [news_title_english] => mahesh babu about vijayashanthi
            [news_short_description] => మహేశ్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. అలనాటి తార విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. కొన్నేళ్లుగా వెండితెరకు 

            [news_tags_keywords] => Mahesh babu,Rashmika Mandanna,Vijayashanti
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => |YaCGtGfoI1Q|
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-09-12 19:36:11
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
విజయశాంతి గురించి మహేశ్‌ ట్వీట్‌ - mahesh babu about vijayashanthi - EENADU
close

తాజా వార్తలు

విజయశాంతి గురించి మహేశ్‌ ట్వీట్‌

హైదరాబాద్‌: మహేశ్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. అలనాటి తార విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. కొన్నేళ్లుగా వెండితెరకు దూరమైన ఆమె ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవలే మళ్లీ మేకప్‌ వేసుకున్న ఆమె తాజా షెడ్యూల్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతిని ఉద్దేశించి మహేశ్‌బాబు ట్వీట్‌ చేశారు. 

కృష్ణ కథానాయకుడిగా విజయశాంతి హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. అందులో ‘కొడుకు దిద్దిన కాపురం’ కూడా ఒకటి. ఇందులో మహేశ్‌బాబు కూడా నటించారు. ఆ చిత్ర సెట్స్‌లో విజయశాంతితో దిగిన ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకుంటూ.. ‘1989లో ఇక్కడే మా జర్నీ ప్రారంభమైంది. అదే కొడుకు దిద్దిన కాపురం. మళ్లీ 30ఏళ్ల తర్వాత విజయశాంతిగారితో పనిచేస్తున్నా. జీవితం అనేది నిజంగా చక్రంలాంటిది’’ అని పేర్కొన్నారు. 

శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేశ్‌ ఇందులో ఆర్మీ అధికారి అజయ్‌కృష్ణగా కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబులు నిర్మిస్తున్నారు. 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.