పంజాబ్‌లో 15 రోజుల రాత్రి కర్ఫ్యూ

తాజా వార్తలు

Published : 25/11/2020 15:53 IST

పంజాబ్‌లో 15 రోజుల రాత్రి కర్ఫ్యూ

చండీగఢ్‌: కరోనా వైరస్‌ విజృంభణకు కళ్లెం వేయడమే లక్ష్యంగా పంజాబ్‌ ప్రభుత్వం కీలక చర్యలు ప్రకటించింది. రాష్ట్రంలో 15 రోజుల పాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని సీఎం అమరీందర్‌సింగ్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని సూచించారు. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే రెట్టింపు జరిమానాను (రూ.1000) విధించాలని ఆదేశించారు. డిసెంబర్‌ 1 నుంచి 15వ తేదీ వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు. కర్ఫ్యూ అమలులో ఉన్న రోజుల్లో నగరాలు/ పట్టణాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, వివాహ వేదికలు రాత్రి 9.30గంటలకే మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించకపోతే రెట్టింపు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. 

మరోవైపు, పంజాబ్‌లో మంగళవారం ఒక్కరోజే 22 మంది కొవిడ్‌తో మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 4653కి పెరిగింది. అలాగే, పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,47,665గా ఉంది. పంజాబ్‌ గవర్నర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీతో పాటు మరో ఆరుగురు నిన్న కొవిడ్‌ బారిన పడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,36,178 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 6834 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని