టిక్‌టాక్‌..యూఎస్‌లోనూ నిషేధం
close

తాజా వార్తలు

Published : 08/08/2020 01:17 IST

టిక్‌టాక్‌..యూఎస్‌లోనూ నిషేధం

45 రోజుల్లోగా అమల్లోకి రావాలని ట్రంప్‌ ఆదేశం

వాషింగ్టన్‌: సోషల్ మీడియా యాప్‌ టిక్‌టాక్‌ నిషేధంపై పరిశీలిస్తున్నామని ఇప్పటికే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తాజాగా ఆ దిశగా చర్యలు చేపట్టారు. టిక్‌టాక్‌ లేదా చైనాకు చెందిన దాని మాతృసంస్థతో సంబంధాలపై 45 రోజుల్లోగా నిషేధం అమల్లోకి రావాలని గురువారం ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకాలు చేశారు. అమెరికాలో టిక్‌టాక్‌ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో ఉంది. 

‘టిక్‌టాక్‌‌ యాప్‌ అమెరికాలో 175 మిలియన్లు, ప్రపంచ వ్యాప్తంగా ఒక బిలియన్‌ కంటే ఎక్కువ సార్లు డౌన్‌లౌడ్ అయింది. వినియోగదారుల నుంచి లొకేషన్, బ్రౌజింగ్, సెర్చ్‌ హిస్టరీలకు సంబంధించి పెద్దఎత్తున సమాచారాన్ని సంగ్రహిస్తోంది. దాని ద్వారా అమెరికన్ల వ్యక్తిగత, ఇతర సమాచారం చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీకి చేరే అవకాశం ఉంది. ఫెడరల్ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల లొకేషన్‌ను ట్రాక్‌ చేయడానికి, బ్లాక్‌మెయిల్, కార్పొరేట్ గూఢచర్యం చేయడానికి చైనా ఆ సమాచారాన్ని వినియోగించే అవకాశం ఉంది’ అని ట్రంప్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ‘దేశ భద్రతను పరిరక్షించడానికి యూఎస్‌ టిక్‌టాక్‌ యజమానులపై దూకుడుగా చర్యలు తీసుకోవాలి’ అని తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

వాణిజ్యం, కరోనా వైరస్‌ అంశాలపై చైనా మీద దూకుడుగా వ్యవహరిస్తోన్న ట్రంప్‌..సెప్టెంబర్ 15లోగా టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాల్ని విక్రయించాలని లేకపోతే మూసివేయాలని హెచ్చరించిన సంగతి తెలిసిందే. మరోవైపు వాటిని కొనుగోలు చేయడానికి సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని